చంద్రబాబు టూర్ సక్సెస్… టీడీపీ నేత రాజీనామా!

గతకొన్ని రోజులుగా టీడీపీ అధినేత జిల్లా పర్యటనలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తూర్పు గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలు దాదాపుగా పూర్తిచేసిన చంద్రబాబు… ప్రకాశం జిల్లా టూర్ కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఆయన టూర్.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. అయితే… ప్రకాశం జిల్లాలో బాబు టూర్ అలా ముగిసిందోలేదో.. ఇంతలోనే షాకింగ్ సంఘటన జరిగింది!

ప్రకాశం జిల్లాలో చంద్రబాబు టూర్ ఫుల్ సక్సెస్ అయ్యిందని, జానాలు తండోపతండాలుగా హాజరయ్యారని చెబుతున్నారు టీడీపీ శ్రేణులు. చంద్రబాబు సైతం… గతమో ఎన్నడూ లేనివిధంగా జనాలొచ్చారని గతం గుర్తుచేసుకుంటున్నారు. అయితే… బాబు సక్సెస్ టూర్ చేసి ఇలా గుంటూరులో ఎంటరయ్యరో లేదో… ఇంతలోనే రాజీనామా పత్రం రాసిచ్చేశాడు ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ తమ్ముడు.

అవును… ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం నాయకుడు పమిడి రమేష్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి లేఖ పంపించేశారు. ఆ మధ్యన దర్శి టీడీపీ ఇంచార్జి పదవికి రాజీనామా చేసిన పమిడి రమేష్… అనంతరం తాను పార్టీలోనే కొనసాగుతానని, టీడీపీని వదిలేది లేదని అపుడు చెప్పుకొచ్చారు. అయితే… తాజాగా బాబు టూర్ కి వెళ్లిన ఫలితమో ఏమో కానీ… బాబు అలా టూర్ ముగించారు.. ఈయన ఇలా పార్టీని వదిలేశారు.

అయితే… దర్శి నియోజకవర్గంలో పార్టీలో అంతర్గత విభేదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఈ విషయాలను రమేష్… ఇప్పటికే పలుమార్పు పెద్దల దృష్టికి తీసుకెళ్లారు కూడా. అయితే… ఈ విషయాలను ప్రస్థావించిన ప్రతిసారీ… జిల్లాకొచ్చినప్పుడు అన్ని సమస్యలూ పరిష్కరిస్తానని మాట ఇచ్చారంట. దీంతో ఇంతకాలం ఓపికతో ఉన్న రమేష్… బాబు జిల్లా కొచ్చి కూడా సమస్యలు పరిష్కరించకపోవడంతో విసిగిపోయారని తెలుస్తుంది.

దీంతో… ఇంకా టీడీపీలోనే ఉంటే… తన రాజకీయ జీవితంతో పాటు, తనను నమ్ముకున్న వ్యక్తిగత అభిమానుల ఫ్యూచర్ కూడా పోతుందని భావించారట. ఇందులో భాగంగా… ఇక మరో ఆలోచన చేయకుండా… తన రాజీనామా లేఖను అధిష్టాణానికి పంపారని తెలుస్తుంది. దీంతో… పైకేమో బాబు టూర్ సక్సెస్.. బాబు టూర్ సూపర్ సక్సెస్ అని చెప్పుకుంటున్నాము.. లోపల మాత్రం వాస్తవాలు ఇలా ఉన్నాయా అని తమ్ముళ్లు ఫీలవుతున్నారంట.

అయితే… రమేష నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది ఇంకా తెలియలేదు. ఫ్యాన్ కిందకి చేరతారా.. లేక, గ్లాసో పువ్వో చేతబడతారా అన్నది తెలియాల్సి ఉంది. ఇంతకాలం సొంత డబ్బులతో పార్టీని, కేడర్ ను కాపాడుకుంటూ వచ్చిన ఈయన పార్టీ వీడటంతో… టీడీపీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తుందని తెలుస్తుంది!