కరెక్ట్ కాదయ్యా ఇది: పవన్ కెరీర్ తో తమ్ముళ్ల ఆటలు!

టీడీపీ – జనసేన పార్టీల విషయంలో ఏ ఒక్కరికీ సరైన స్పష్టత లేదనేది తెలిసిన విషయమే! బీజేపీ – జనసేన కలిసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తాయని బీజేపీ నేతలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే! అవి రెండూ మిత్రపక్షాలు కాబట్టి.. బీజేపీ నేతల కామెంట్లలో కరెక్టే! అయితే… తెర వెనుక రాజకీయాలను గమనిస్తున్నవారు మాత్రం.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయని అంటున్నారు!

ఆ సంగతులు అలా ఉంటే… చంద్రబాబుతో స్నేహం వల్ల పవన్ కల్యాణ్ కెరీర్ ముగిసిపోయ్యే ప్రమాదం ఉందనేది కొందరు అనుభవజ్ఞులైన జనసైనికుల మాట! ఓపిక ఉన్నంత కాలం పవన్ స్టామినాను చంద్రబాబు వాడుకుంటారే తప్ప.. పవన్ ను అందలం ఎక్కించే ప్రశ్నే లేదనేది వారి మాటగా ఉంది! అందుకు కొన్ని కారణాలు కూడా లేకపోలేదట!

ఇప్పటికే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో టీడీపీ – జనసేనలు కలిసి పోటీచేస్తాయనేది కన్ ఫాం ఐపోయిన సంగతే! అయితే.. ఇది కచ్చితంగా టీడీపీకి కలిసొచ్చే అంశం అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే.. రాబోయే ఎన్నికల్లో జనసైనికుల మద్దతును వాడుకోవడం ఎంత ముఖ్యమో.. జనసేనాధినేత పవన్ ను ఓడించడం కూడా అంతే ముఖ్యం అని భావిస్తున్నారట టీడీపీలోని ఒక వర్గం పెద్దలు! అందులో భాగంగా సోషల్ మీడియాలో పవన్ పోటీచేయబోయే నియోజకవర్గం ఇదే అంటూ కొన్ని గాసిప్పులు సృష్టిస్తున్నారు!

సాధారణంగా పార్టీ అధినేతలు ఎప్పుడూ.. వీలైనంత సేఫ్ నియ్యోజకవర్గాన్ని ఎంచుకుని పోటీకి దిగుతుంటారు. అందులో భాగమే భీమవరం – గాజువాక అని గతంలో పవన్ భావించిన సంగతి తెలిసిందే! అయితే అవి ఏమాత్రం సేఫ్ కాదని.. ఈ సారి మరింత సేఫ్ గేం ఆడాలని, అందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, లేక శ్రీకాకుళం జిల్లాలో పోటీచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ తమ్ముళ్లు మాత్రం… పవన్ ఈసారి ఏనుగు కుంబస్థలాన్ని కొట్టబోతున్నాడంటూ ఇరికించేస్తున్నారు.

అవును.. ఈసారి పవన్ కల్యాణ్ గుడివాడ నుంచి పోటీ చేసి కొడాలి నాని ని మట్టికరిపించాలని చూస్తున్నారని తమ్ముళ్లలో ఒక వర్గం ప్రచారం మొదలుపెటింది. ఫలితంగా గతంలో రెండు చోట్లా ఓడిపోయినా కూడా.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్ తో అసెంబ్లీకి వస్తారని చెబుతున్నారు. అయితే… ఇది ఏమాత్రం నిజాయితీ అయిన ఆట కాదని, కావాలనే టీడీపీ కార్యకర్తలు కొందరు పవన్ ను ఇరికిస్తున్నారని.. టీడీపీ నేతలు పొట్టలో కత్తులు పెట్టుకుని పవన్ ను కౌగిలించుకుంటున్నారని వాపోతున్నారు!

జనసైనికులు అన్నారని కాదు కానీ.. నిజంగా గుడివాడలో కొడాలి నానీ ని ఢీకొట్టడం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టమైన విషయం అనేది వాస్తవం అని.. చంద్రబాబు మాత్రం కుప్పంని, బాలయ్య బాబు హిందూపూర్ ని నమ్ముకుని సేఫ్ గేం ఆడతారు కానీ.. పవన్ ని మాత్రం ఇలా ఇరికించేయడం దారుణమైన సంగతనేది పలువురి మాటగా ఉంది!