Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా టార్గెట్ అవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి చిన్న విషయాన్ని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో చేసిన తప్పులే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యారని అందుకే ఈయన కూడా మౌనంగా ఉన్నారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా మీడియా వార్తలలోనూ అలాగే సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కొంత మంది నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో పవన్ పూర్తిగా టార్గెట్ అయ్యారని చెప్పాలి. ఇటీవల సినిమాల విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకున్నారు.
ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున హీరోల అభిమానులను ఆకట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఎంతోమంది సినీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లడంతో ఆయన కనీసం నమస్కారం కూడా చేయలేదని పెద్దవారి చేత నమస్కారం చేయించుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి అరగంట పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిని వెయిట్ చేయించి మరి మీటింగ్ కు హాజరయ్యారు.
రేవంత్ రెడ్డి కంటే వయసులో ఎంతో పెద్దవారైనటువంటి సెలబ్రిటీలు కూడా రేవంత్ రెడ్డికి వంగి వంగి మరి దండాలు పెట్టారు. కానీ ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలేదు. ఇక గతంలో జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి కూడా తీసుకున్నారు అయినప్పటికీ పవన్ ఏం మాట్లాడకపోవడంతో విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పే ప్రస్తుతం ఇక్కడ కూడా చేస్తున్న నేపథ్యంలో ఆయన మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి చిరంజీవి వెళ్ళితే ఆయన తనకు భోజనాలు ఏర్పాటు చేసి తిరిగి వెళుతున్న సమయంలో శాలువా కప్పి సత్కరించి కారు వరకు వెళ్లి వారిని సాగనంపారు కానీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ బహిరంగ సభలలో జగన్మోహన్ తప్పుపడుతూ వచ్చారు. అయితే ఈ విషయంలో చిరంజీవి కూడా మౌనం పాటించారే తప్ప జరిగిన విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. ఇలా గతంలో ప్రతి విషయాన్ని తప్పు పట్టిన పవన్ ఇప్పుడు మౌనం పాటించడంతో ఈయనని టార్గెట్ చేశారని తెలుస్తుంది.
