తారక రత్న హెల్త్ అప్డేట్స్: అంతా గందరగోళమే.!

తారక రత్నకు కుప్పంలో యాంజియో ప్లాస్టీ జరిగిందంటున్నారు.. కానీ, అది కుదరలేదంటున్నారు. ఎక్మో సాయం ఆయనకు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అది ఉత్తదేనంటున్నారు. అసలేం జరుగుతోంది.? తారక రత్న ఎలా వున్నాడు.? కుప్పంలో తారక రత్నకు తీవ్ర గుండెపోటు రాగా, ఆయనకి తొలుత కుప్పంలోనే వైద్య చికిత్స అందించి, ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఈ తరలింపులోనూ కొంత జాప్యం జరిగింది.

ఎక్మో సాయంతో ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు తొలుత వార్తలొచ్చాయి. ‘అలాంటిదేమీ లేదు’ అని తారక రత్న సోదరుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ చెప్పాడు. జూనియర్ ఎన్టీయార్ చెప్పేవరకూ కూడా తారక రత్న ఎక్మో మీదనే వున్నాడని అంతా అనుకున్నారు. స్పృహ వచ్చిందంటూ నందమూరి బాలకృష్ణ చెప్పగా, ఈ విషయమ్మీద కూడా చాలా గందరగోళం వుంది. తారక రత్న బాబాయ్ నందమూరి రామకృష్ణ అయితే, తారక రత్న తనంతట తానుగా శ్వాస తీసుకుంటున్నట్లు ఈ రోజు సాయంత్రం ప్రకటించారు.

కానీ, సాయంత్రం నారాయణ హృదయాలయ నుంచి విడుదలైన అధికారిక హెల్త్ బులెటిన్‌లో, వెంటిలేటర్‌పై పూర్తిస్థాయి లైఫ్ సపోర్ట్ తారక రత్నకు అందిస్తున్నట్లు చెప్పారు. ఆస్థాయి లైఫ్ సపోర్ట్ అంటే, అది కృత్రిమ శ్వాస అనే అర్థం. సో, తారక రత్న తనంతట తానుగా శ్వాస తీసుకోలేకపోతున్నాడు. అసలు వాస్తవాల్ని కప్పిపుచ్చాల్సిన అవసరం ఏమొస్తోంది.?