తమిళ సినిమా గోల మనకెందుకు పవన్ కళ్యాణ్.?

తెలుగు నేలపై పుట్టినంతమాత్రాన తెలుగులో అనర్గళంగా మాట్లాడాల్సిన అవసరం వుందా.? మాట్లాడలేకపోతే అది నేరమా.? తెలుగులో మాట్లాడితే మంచిదే.! కానీ, ట్రెండ్ మారింది. ఇంగ్లీషు చదువులు.. విదేశాల్లో సెటిలైపోవాలనే కోరికలు.. మధ్యతరగతి నుంచే ప్రారంభమవుతున్నాయి ఈ ఆలోచనలు.

సముద్రఖని చక్కగా తెలుగులో మాట్లాడుతుండడాన్ని అభినందించాల్సిందే. కానీ, అందరూ అలా వుండరు కదా.! ఏ ఉద్దేశ్యంతో భాషా ప్రస్తావన పవన్ కళ్యాణ్ ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెచ్చారో ఏమో.! దానికి కొనసాగింపుగా, తెలుగు సినీ పరిశ్రమ గొప్పతనాన్ని చెబుతూ, తమిళ సినీ పరిశ్రమలోని ‘స్థానిక రచ్చ’పై క్లాస్ పీకారు.

టాలీవుడ్‌లా వుండదు కోలీవుడ్‌లో వ్యవహారం. సముద్రఖని మీద విపరీతమైన ఒత్తిడి వుంటుందిప్పుడు. ఏఎం రత్నం మీద కూడా.! తమిళ సినిమా అంతర్గత వ్యవహారాల్లోకి దూరి, క్లాసులు తీసుకోవాల్సిన అవసరం.. లేదా.. సూచనలు చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్‌కి ఏమొచ్చిందో.!

ఓ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు పవన్ కళ్యాణ్.. దేశ్ కీ నేతా.. అంటూ సముద్రఖని, ఏఎం రత్నం.. పవన్ కళ్యాణ్‌ని పొగిడేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో, అనవసరమైన విషయాల గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే, ఏపీ గురించి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవహారాల జోలికి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ తటపటాయిస్తారు. అలాంటప్పుడు, తమిళ వ్యవహారాలు మనకెందుకు.? చెప్పిన మాట మంచిదే కావొచ్చు.. అటువైపు అర్థం చేసుకునే తీరు వేరేలా వుంటుంది.

తమిళ సినీ పరిశ్రమ, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకుంటే, మన సినిమాలు తమిళనాడులో ఏమవుతాయ్.?