బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబుకు సుప్రిం నోటీసులు

Chandra Babu Naidu is struggling as an Opposition leader

అధికారంలో ఉండగా చేసిన పనికిమాలిన పనిపై సుప్రింకోర్టు ఇపుడు చంద్రబాబునాయుడుకు నోటీసులిచ్చింది.  పోలింగ్ మరో రెండు రోజులుందనగా అప్పట్లో చంద్రబాబు పసుపు-కుంకుమ, అన్నదాగ సుఖీభవ అనే పథకాల లబ్దిదారుల ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు కుమ్మరించారు. 

ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగుతుందనగా గెలుపు లక్ష్యంతోనే చంద్రబాబు రెండు పథకాలను లాంచ్ చేశారు.  ఆ విషయాన్ని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. దీనిపై ప్రధాన ప్రతిపక్షం అప్పట్లో ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా చంద్రబాబు కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ పట్టించుకోలేదు.

సరే పోలింగ్ ముందు వేల కోట్లు డబ్బులు ఖాతాల్లో జమైనా జనాలు చంద్రబాబుకు ఓట్లేశారా ? అంటే అదీ లేదు.  ఖాతాల్లో డబ్బులు తీసుకుని వైసిపికి ఓట్లేశారు. సరే ఎన్నికలైపోయింది కాబట్టి అందరూ ఆ విషయాన్ని వదిలేశారు. అయితే హఠాత్తుగా సుప్రింకోర్టు ఇదే విషయమై చంద్రబాబుపై మండిపడింది. వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.

ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో పథకాలు పెట్టటం, పోలింగ్ ముందు ఖాతాల్లో వేల కోట్లు జమచేయటంపై సుప్రింకోర్టు చాలా సీరియస్ అయ్యింది. వెంటనే చంద్రబాబుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు అప్పటి అధికారులకు కూడా నోటీసులివ్వాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే సుప్రింకోర్టు చంద్రబాబు అండ్ కోకు నోటీసులు జారిచేసింది.