చంద్రబాబునాయుడుకు సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. వచ్చే ఫిబ్రవరి నెల నుండి ఓటుకునోటు కేసును రెగ్యులర్ గా విచారించాలని తాజాగా నిర్ణయించింది. సంవత్సరాల తరబడి ఓటుకునోటు కేసు విచారణ కోల్డ్ స్టోరేజిలో ఉండిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటుకునోటు కేసులో పాత్రదారులెవరో అందరికీ తెలిసినా సూత్రదారులెవరూ మాత్రం టెక్నికల్ గా బయటపడలేదు. అయితే సూత్రదారులెవరో కూడా ప్రపంచానికి అంతటికీ తెలుసు. అయినా కేసు విచారణ జరిగితే సూత్రదారులు బయటపడతారన్న ఉద్దేశ్యంతోనే కేసు విచారణను ముందుకు సాగనీయకుండ అడ్డుకుంటున్నారు.
కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబునాయుడే అంటూ వైసిసి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టులో కేసు వేశారు. అయితే, ఆ కేసుతో తనకు సంబంధం ఉందని కానీ లేదని కానీ చద్రబాబు ఇంత వరకూ బహిరంగంగా చెప్పలేదు. పోనీ నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ తో మాట్లాడినపుడు బయటపడిని ఆడియో టేపుల్లో వినిపించిన గొంతు కూడా తనది కాదని చంద్రబాబు చెప్పలేకున్నారు. అలాగని తానే మాట్లాడినట్లు ఒప్పుకోవటం లేదు. దాంతో ఈ కేసు విచారణకు ఆళ్ళ పట్టుపట్టారు. కానీ అసలు విచారణకే రానీకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారట.
దాదాపు ఏడాది నుండి ఆళ్ళ చేస్తున్న పోరాటం వల్ల ఈరోజు కేసును సుప్రింకోర్టు విచారించింది. ఆళ్ళ తరపున, టిడిపి తరపు లాయర్ల వాదనలు విన్న న్యాయమూర్తి వచ్చే ఫిబ్రవరి నుండి కేసును రెగ్యులర్ గా విచారించనున్నట్లు ప్రకటించారు. దాంతో చంద్రబాబుకు పెద్ద షాకిచ్చినట్లైంది. కేసును ఇఫుడు కూడా విచారణకు తీసుకునేందుకు లేదని టిడిపి లాయర్లు వాదించారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, కేసు వేయటమే కక్షపూరితంగా వేశారని వాదించారు. అయితే, ఎన్నికలతో కేసుకు సంబంధం లేదని, కేసులో మెరిట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తామని న్యాయమూర్తి స్పష్టం చేయటంతో టిడిపి లాయర్లు మాట్లాడలేకపోయారు.
అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే తెలంగాణా ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి తరపున వేం నరేందర్ రెడ్డిని పోటీలోకి దింపింది. నిజంగా టిడిపి అభ్యర్ధి గెలిచే అవకాశమే లేదు. అయినా పోటీకి ఎందుకు దిగారంటే టిఆర్ఎస్ ఎంఎల్ఏలను కొనుగోలు చేసి గెలవాలన్న ఏకైక ప్లాన్ తో నే దిగారు. నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన సన్ ఓటును రూ 5 కోట్లకు బేరం చేసుకున్నారు. అడ్వాన్సుగా రూ 50 లక్షలు ఇవ్వటానికి ఎంఎల్ఏ ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అప్పటి నుండి ఈ కేసు విచారణ నత్తనడక నడుస్తోంది. ఇపుడు సుప్రింకోర్టు దయవల్ల స్పీడ్ అవుతోంది.