చంద్రబాబుకు సుప్రింకోర్టు షాక్

అవును చంద్రబాబునాయుడుకు సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. వివి ప్యాట్ల లెక్కింపులో కనీసం 50 శాతం వివి ప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు వాదిస్తున్నారు. 21 విపక్ష పార్టీల తరపున చంద్రబాబు ఈ విషయమై ఒకటే గోల చేస్తున్నారు. అదే విషయమై ఈరోజు సుప్రింకోర్టు విచారణ జరిగింది. అయితే కేసుపై ఎటువంటి వాదనలు వినకుండానే కోర్టు కేసును కొట్టేసింది.

ఈవిఎంల్లో ఓట్ల లెక్కింపుపై తేడాలు వస్తే ర్యాండమ్ గా 5 పోలింగ్ కేంద్రాల్లోని వివి ప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. అయితే ర్యాండమ్ గ 5 వివి ప్యాట్లను కాదని కనీసం 50 శాతం వివిప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలన్నది చంద్రబాబు వాదన. ఈవిఎంల విషయంలో కానీ వివి ప్యాట్ల విషయంలో కానీ చంద్రబాబు తప్ప ఇతర పార్టీల నేతలెవరూ పెద్దగా పట్టించుకోలేదు.

వ్యక్తిగతంగా ఎలక్షన్ కమీషన్ తో చెడిన కారణంగా చంద్రబాబు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏదో ఒక విధంగా ఎలక్షన్ కమీషన్ పై పై చెయ్యి సాధించాలన్న టార్గెట్ తోనే చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మొత్తానికి విషయం సుప్రింకోర్టుకు ఎక్కింది.

గతంలో ఏనాడు లేనివిధంగా చంద్రబాబు ఏకంగా సుప్రింకోర్టుకే హాజరయ్యారు. వ్యక్తిగత కేసుల విషయంలో కూడా చంద్రబాబు ఏనాడూ కోర్టుకు హాజరుకాలేదు. అలాంటిది వివి ప్యాట్ల లెక్కింపు కేసులో మాత్రం హాజరయ్యారు. అయినా ఫలితం దక్కలేదు. విచారణ మొదలైన వెంటనే వాదనలు వినకుండానే సుప్రింకోర్టు కేసును కొట్టేసింది. మరిపుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.