ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై, హిందూ మతం పై జరుగుతున్న ఘటనలతో, హిందువులు అందరూ బాధపడుతున్నారు. రాష్ట్రంలో మెజారిటీ హిందూ జనాభా ఉండటం, ప్రభుత్వం 20 నెలలు అయినా, ఈ సమస్య పరిష్కరించక పోవటం, ఈ ఘటనలకు పరాకాష్టగా రామతీర్ధం ఉండటం, అప్పటికే నాలుగు రోజులు అయినా, ప్రభుత్వం ఈ విషయం సీరియస్ గా తీసుకోకపోవటంతో అయితే ఈ విషయంలో స్వామీజీలు అందరూ జగన్ వైఖరిని తప్పు బట్టగా, కేవలం ఇద్దరు మాత్రమే జగన్ కు సపోర్ట్ చేసారు. ఒకటి విశాఖ శారదా పీఠం స్వామి, రెండు సుబ్రహ్మణ్యస్వామి .
శారదా పీఠం స్వామి కొంచెం ఆచి తూచి స్పందించారు కానీ, సుబ్రహ్మణ్యస్వామి అయితే వన్ సైడ్ గా, జగన్ వైపు నిలబడ్డారు. ఇంకో అవాక్కయ్యే విషయం ఏమిటి అంటే, జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ అని ఎవరు చెప్పారు, ఆయన హిందువు అంటూ చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ మోహన్ రెడ్డి తిరుమలని ఎంతో పవిత్రం చేసారని, రెండు గంటలకు కూడా స్వామికి జగన్ పూజలు చేసారని, జగన్ హిందువు కాక మరి ఏమిటి, ఆయన హిందువే అంటూ సర్టిఫికేట్ ఇచ్చారు.
అయితే సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యల పై అందరూ అవాక్కయ్యారు. ఇదేమి వింత వాదన అంటూ సుబ్రహ్మణ్యస్వామి వైఖరిని తప్పు బట్టారు. జగన్ ను సమర్ధించుకునే విధానం ఇది కాదని అన్నారు. ఆయన హిందువు అని, సుబ్రహ్మణ్యస్వామి ఎలా చెప్పారో అర్ధం కావటం లేదని అన్నారు. జగన్ కుటుంబం మొదటి నుంచి క్రీస్టియన్ మతాన్ని ఫాలో అవుతారని, జగన్ ఎప్పుడు తాను హిందువు అని చెప్పుకోలేదని, గుర్తు చేస్తున్నారు. ఈ వివాదానికి, జగన్ ఒక్కరే సమాధానం చెప్పగలరు. అసలు సుబ్రహ్మణ్యస్వామి ఇంతలా జగన్ ను ఎందుకు వెనకేసుకుని వస్తున్నారో, ఎవరికీ అర్ధం కావటం లేదు.