సీనియర్ ఎన్టీఆర్ మరణానికి కారణమేంటనే ప్రశ్నకు పరోక్షంగా చంద్రబాబే కారణమని ఎవరైనా చెబుతారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు అధికారానికి దూరం చేయకుండా ఉండి ఉంటే సీనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా మరికొన్ని సంవత్సరాలు జీవించేవారు. అయితే అన్ స్టాపబుల్ షోలో సీనియర్ ఎన్టీఆర్ టాపిక్ తెచ్చి ఆ ఘటన విషయంలో బాలయ్య చంద్రబాబుకు సపోర్ట్ చేసేలా కామెంట్లు చేయనున్నారని ప్రోమో ద్వారా అర్థమైంది.
ఓటీటీ షో కోసం తండ్రి పరువు తీయడం బాలయ్యకు కరెక్టేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని బాలయ్యకు సిగ్గుందా అంటూ కామెంట్లు చేస్తున్నారంటే ఎక్కడ తప్పు జరిగిందో బాలయ్య అర్థం చేసుకోవాల్సి ఉంది. చంద్రబాబు గజదొంగ అని సీనియర్ ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని కొడాలి కాని అన్నారు. తండ్రికి ద్రోహం చేసిన వ్యక్తి కొడుకుకు బాలయ్య పిల్లను ఇచ్చాడంటూ కొడాలి నాని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీని నేను కాపాడానని చంద్రబాబు చెప్పడం దారుణమని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. కొడాలి నాని విమర్శల గురించి టీడీపీ నేతలు కానీ బాలయ్య కానీ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. అన్ స్టాపబుల్ తొలి ఎపిసోడ్ విడుదలైన తర్వాత చంద్రబాబు కామెంట్ల గురించి మరింత చర్చ జరిగే ఛాన్స్ అయితే ఉంది. రేపే ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
వల్లభనేని వంశీ సైతం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వస్తున్న విమర్శల గురించి ఒకింత ఘాటుగా స్పందించి వార్తల్లో నిలిచారు. టీడీపీపై విమర్శల విషయంలో ఏ అవకాశాన్ని వదులుకోకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. షో రేటింగ్ కోసం బాలయ్య చేస్తున్న పనులపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలయ్య షోకు రావడానికి కొంతమంది హీరోలు మాత్రం ఇష్టపడటం లేదు.