పరువు దక్కించుకున్న చంద్రబాబు

ఢిల్లీ దీక్షలో చంద్రబాబునాయుడు పరువు దక్కించుకున్నారు. రాష్ట్రస్ధాయిలో విపక్షాలేవీ మద్దదతుగా నిలవకపోయినా ఢిల్లీలో మొదలైన ఏపి భవన్ దీక్షలో మాత్రం జాతీయ పార్టీల అధినేతలు హాజరవ్వటంతో పరువు నిలుపుకున్నారు. ఏపి భవనలో ప్రారంభమైన దీక్షకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఎస్పీ తరపున ములాయంసింగ్ యాదవ్, జనతా దళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత తదితరులు వచ్చి చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపారు.

గతంలో విజయవాడలో చేసిన ధర్మపోరాట దీక్షలో కూడా జాతీయ స్ధాయి నేతలు హాజరవుతారని చంద్రబాబు అండ్ తో పాటు చద్రబాబు మీడియా కూడా బాగా ఊదరగొట్టింది. అయితే అప్పట్లో విజయవాడకు జాతీయపార్టీ నేతలెవరూ హాజరుకాలేదు. దాంతో చంద్రబాబు పరువు పోయింది. అటువంటి పరిస్ధితి మళ్ళీ ఎదురవ్వకుండా ఇపుడు ముందు జాగ్రత్తపడ్డారు. అందుకనే ప్రత్యేకించి జాతీయ పార్టీల అధినేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. దాంతో కొందరు అధినేతలు వచ్చారు.

ఇంతమంది జాతీయ నేతలు వచ్చారు కాబట్టి నరేంద్రమోడికేదో అయిపోతుందని అనుకునేందుకు లేదు. ఎందుకంటే, చంద్రబాబుకు మద్దతుగా నిలబడిన ఇటువంటి నేతల వల్ల మోడికి వచ్చిన నష్టమేమీలేదు. ఎలాగంటే విడివిడిగా మోడిని అందరూ వ్యతిరేకిస్తున్నవాళ్ళే. అంటే మమతా బెనర్జీ, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, శరద్ యాదవ్ మధ్య సఖ్యత లేదు.

అందరూ కలిసి ఒక గొడుగు క్రిందకు రమ్మంటే మాత్రం రావటం లేదు. ఎవరికి వారే రేపటి ప్రధానమంత్రి అయిపోవాలన్న కోరికతోనే ప్రతి ఒక్కళ్ళు రెండో వారికి సహకరించటం లేదు. కాబట్టి వీళ్ళ వల్ల మోడికొచ్చే ముప్పేలేదు. ఇక చంద్రబాబుభవిష్యత్ అంటారా అది వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తెచ్చుకునే ఎంపి సీట్ల మీదే ఆధారపడుంటుంది.