జగన్ నిర్ణయం వెనుక షాకింగ్ ప్లాన్.. ?

YSRCP

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం గురించి ఏపీ ప్రజల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ గొప్ప వ్యక్తి అని అయితే సీనియర్ ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెట్టాలని మాత్రం ఎవరూ కోరుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్ నిర్ణయం వెనుక షాకింగ్ ప్లాన్ ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఏపీలో ఈ మధ్య కాలంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అమరావతి రైతుల ఉద్యమంను పక్కదారి పట్టించాలనే ఆలోచనతోనే జగన్ ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టి అందరూ ఈ విషయం గురించే ఆలోచించేలా జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. జగన్ నిర్ణయంతో టీడీపీ, జనసేన ఏం చేసినా ప్రస్తుతం ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు.

రాబోయే రోజుల్లో జగన్ ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గుతారో లేదో చూడాల్సి ఉంది. టీడీపీ ఇప్పటికే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఇదే తరహా స్పందన వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరో వారం నుంచి రెండువారాల పాటు ఈ విషయం గురించి చర్చ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

ఆ సమయానికి అమరావతి ఉద్యమాన్ని కూడా ప్రజలు పెద్దగా పట్టించుకునే ఛాన్స్ అయితే ఉండదు. జగన్ మాస్టర్ ప్లాన్ గురించి పూర్తిస్థాయిలో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. జగన్ ఏపీ ప్రజల దృష్టిని మరల్చి ఏం సాధిస్తారో చుడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వైఎస్సార్ పేరును మార్చినా ప్రశ్నించే అధికారం జగన్ కు ఉండదనే సంగతి తెలిసిందే.