నేనన్నిటికీ అతీతం అనుకుంటుంటారు చంద్రబాబు.! వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో తనకు తానే సాటి.. అన్న భావనతోనూ వుంటారాయన. కానీ, ఆ పప్పులేమీ ఉడకడంలేదు. కాలం అన్ని వంకర్లనీ తీర్చేస్తుందంటారు. చంద్రబాబు పరిస్థితి అదే.!
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.! పధ్నాలుగేళ్ళపాటు ముఖ్యమంత్రి.. పదిహేనేళ్ళకు పైగా ప్రతిపక్ష నేత.. ప్చ్.. ఏం లాభం.? ఇప్పుడాయన జైలు నుంచి బయటకు వచ్చే దారి కనిపించక గిలగిల్లాడుతున్నారు. హైకోర్టేమో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ని కొట్టేసింది.
ఇంకోపక్క, సీఐడీ కోరిన విధంగా న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. రాజమండ్రి జైల్లోనే చంద్రబాబుని విచారించేందుకు సీఐడీకి అనుమతి మంజూరు చేసింది న్యాయస్థానం. న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరుగుతుందిట.
అసలంటూ అరెస్టు అక్రమం అనీ, రిమాండ్ చెల్లదనీ.. వాదించే బదులు, బెయిల్ కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు ప్రయత్నించి వుంటే, చంద్రబాబుకి కాస్తయినా ఊరట దొరికేది. ఇప్పుడేమో, పరిస్థితి ఇలా తగలడింది. నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి, ఢిల్లీలో తిరుగుతున్నారు.
నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వింత వింత చేష్టలు చేస్తున్నారు. పార్టీకి సరైన దిశా నిర్దేశం లేక, తెలుగు తమ్ముళ్ళు విలవిల్లాడుతున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇదో అతి పెద్ద సంక్షోభం. ఇక్కడితో ఈ పార్టీకి సమాధి.. అన్నంతగా పరిస్థితులు మారిపోయాయ్.
ఒకే ఒక్క ఆశ చంద్రబాబుకైనా.. టీడీపీకి అయినా.! అదే సింపతీ.! జైలుకి వెళ్ళి వస్తే, ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని బలంగా నమ్ముతున్నట్టున్నారు.. కానీ, అలా వచ్చే దారేదీ.?