YS Sharmila: వైయస్ షర్మిల ఏపీ రాష్ట్ర రాజకీయాలలోకి వచ్చి తప్పు చేశారా అంటే అవుననే అంటున్నాయి సొంత పార్టీ వర్గాలు. వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించి అక్కడ కూడా పాదయాత్రలు అంటూ పెద్ద ఎత్తున హంగామా చేశారు అయితే ఎన్నికలలో పోటీ చేయకముందే ఆమె తన పార్టీని పక్కనపెట్టి ఏపీ రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ఇలా ఏపీలో ఈమె రాజకీయాలలోకి రావడంతోనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా పదవి అందుకున్నారు.
ఇలా పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈమె వ్యవహార శైలి పార్టీ హై కమాండ్ కి ఏమాత్రం నచ్చలేదని తెలుస్తుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కూడా షర్మిల వ్యవహార శైలిని పూర్తిగా తప్పు పట్టడమే కాకుండా ఈమె గురించి ఫిర్యాదులు కూడా వెళ్లడంతో కాంగ్రెస్ హై కమాండ్ షర్మిల విషయంలో పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది.
ఏదైనా పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేస్తే సీనియర్ నేతలు అందరికీ కూడా ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుంది కానీ షర్మిల మాత్రం అలా ఎవరికి సమాచారం ఇవ్వకుండా తనకు నచ్చిన విధంగా పార్టీని నడిపిస్తున్నారు దీంతో సీనియర్ నాయకులు ఈమె వ్యవహార శైలిని తప్పుపడుతూ పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు.
ఇలాగే కొనసాగితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కష్టమవుతుందని హై కమాండ్ భావించారు దీంతో షర్మిల స్థానంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని నియమించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఎలాగో బిజెపితో పొత్తు పెట్టుకున్నారు కనుక ఆయన బిజెపిని వదిలి రారు. ఇక మిగిలినది జగన్మోహన్ రెడ్డి. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని తమకు అనుగుణంగా మార్చుకోవాలని అందుకే జగన్ కి సన్నిహితంగా ఉన్న వ్యక్తికి పీసీసీ పదవి ఇవ్వాలనే నిర్ణయంలో హై కమాండ్ ఉన్నారని తెలుస్తోంది. ఇలాంటి ఒక కీలక పదవిలో ఉన్నటువంటి షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేయకుండా తరచూ తన అన్నయ్యను టార్గెట్ చేస్తూ ఆయనపై విమర్శలు చేయడంతో సీనియర్ నాయకులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు