తెలుగుదేశంపార్టీలోకి తొందరలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి కొషోర్ చంద్రదేవ్ చేరబోతున్నారు. ప్రత్యేకహోదా, రాష్ట్రప్రయోజనాల కోసం ఢిల్లీలోని ఏపి భవన్లో సోమవారం నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే కదా. దీక్ష ముగిసిన తర్వాత చంద్రదేవ్ ప్రత్యేకంగా చంద్రబాబును కలిశారు. కిషోర్ కూడా కాంగ్రెస్ కు ఈమధ్యనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన దగ్గర నుండి కిషోర్ టిడిపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
తొందరలో ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో చంద్రదేశ్ సిఎంను కలవటం ప్రాధాన్యత సంతరించుకున్నది. రేపటి ఎన్నికల్లో చంద్రదేవ్ టిడిపి అభ్యర్ధిగా అరకు పార్లమెంటుకు పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారాన్ని చంద్రదేవ్ కూడా ఖండించలేదు. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చంద్రదేవ్ ఓడిపోయారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో కూడా పెద్దగా కనబడలేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనలేదు.
వైసిపి తరపున పోటీ చేసిన గీత తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. తర్వాత కొంత కాలానికే గీత టిడిపి నుండి కూడా దూరమైపోయారు. దాంతో ఇటు టిడిపితో పాటు అటు వైసిపిలో కూడా అభ్యర్ధి లేరు. అందుకే చంద్రబాబు కూడా చంద్రదేవ్ రాక విషయంలో ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక అదే సమయంలో వైసిపి కూడా కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపబోతోంది. దాంతో రాబోయే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా చంద్రదేవ్-వైసిపి అభ్యర్ధి మధ్యే ఉంటుందనటంలో సందేహం లేదు.