రాయలసీమ యువకుల యాక్సిడెంట్ ఇలా జరిగింది (ఎక్స్ క్లూజివ్ వీడియో)

అరవింద సమేత సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని చూపించి అవమాన పరిచారని ఆ సీన్లను కట్ చేయాలని డిమాండ్ చేసిన రాయలసీమ యువకులు కర్నూల్ నుంచి హైదరాబాద్ వస్తున్నపుడు మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారి ప్రమాదానికి సెల్పీ వీడియోనే కారణమని తేలింది. 

తెలంగాణలో వర్షం బాగా పడుతున్నది, రాయలసీమలో కూడా ఇలా కురిస్తే పంటలు బాగా పండుతాయని మాట్లాడుకుంటూ వీడియో తీస్తున్నపుడు ప్రమాదం జరిగింది. వీడియో తీస్తున్నపుడ శీను, కృష్ణ, రాజా, రవికుమార్ ల వాహనం ఎదురుగా వస్తున్న మరొక వాహనంతో ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.