చంద్రబాబునాయుడు కుటుంబానికి భద్రతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగ్గించేస్తోంది. చంద్రబాబుకు ఎలాగూ జడ్ ప్లస్ క్యాటగిరినే ఉంది కాబట్టి దాన్ని తగ్గించే అవకాశం లేదు. అందుకనే భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలకు మొన్నటి వరకూ ఉన్న సెక్యురిటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
అదే సమయంలో మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న ఎంల్సీ నారా లోకేష్ భద్రతను ప్రభుత్వం తగ్గించేసింది. ముఖ్యమంత్రి కొడుకుగా, మంత్రిగా ఉన్న లోకేష్ కు కూడా జడ్ ప్లస్ సెక్యురిటి ఉండేది. 24 గంటలు 4+4 భద్రతను ప్రస్తుతానికి 2+2కు తగ్గించేసింది. దాంతో చంద్రబాబుతో పాటు టిడిపి నేతలంతా గగ్గోలు మొదలుపెట్టారు.
విదేశాల నుండి చంద్రబాబు కుటుంబం రాగానే తమ భద్రతను ఉపసంహరించుకోవటం, లోకేష్ కు తగ్గించేసిన విషయం తెలిసింది. దాంతో తెలంగాణా నేతలతో హైదరాబాద్ లో సమావేశమైన చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కొన్ని అదనపు సౌకర్యాలు ఉంటాయి. ఆ అదనపు సౌకర్యాలన్నీ సిఎంగా ఉన్నంత కాలమే ఉంటాయి. సిఎంగా దిగిపోతే ఆటోమేటిక్ గా అవి మాయమైపోతాయి. ఇపుడు చంద్రబాబు విషయంలో జరుగుతున్నది కూడా అదే. కాకపోతే నానా యాగీ చేయటానికి అలవాటుపడిపోయిన చంద్రబాబు అండ్ కో యధావిధిగా రచ్చ చేస్తున్నారు.