ఎట్టకేలకు కిడ్నప్ కేసులో అఖిల ప్రియకు ఊరట !

Secunderabad Sessions Court granted conditional bail to Bhuma Akhil Priya

తెలంగాణ: హాఫీజ్ పేట భూముల వ్య‌వ‌హారంలో బోయిన‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ‘భూమా అఖిల ప్రియ’కు శుక్రవారం నాడు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు బెయిల్ షరతుల ప్రకారం రూ. 10 వేల రూపాయల రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశిస్తూ కండిషన్ బెయిల్ మంజూరు చేసింది.

Secunderabad Sessions Court granted conditional bail to Bhuma Akhil Priya
Secunderabad Sessions Court granted conditional bail to Bhuma Akhil Priya

బోయిన్‌పల్లి అపహరణ కేసులో అఖిలప్రియ ఎ1 నిందితురాలుగా అఖిల ప్రియ ఉండగా, ఆమె భర్త భార్గవ్ రామ్ కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖిలప్రియకు బెయిల్ మంజూరు కావడంతో శనివారం నాడు చంచల్‌గూడా జైల్ నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని ఆమె తరపు న్యాయవాదులు వివరిస్తున్నారు. ఇదిలావుండగా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు సికింద్రాబాద్ కోర్ట్ లో చుక్కెదురైంది. భార్గవ్ రామ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను సికింద్రాబాద్ కోర్ట్ కొట్టి వేసింది.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టుకు విన్నవించారు. భార్గవ్ రామ్ ఈ కేసులో ఎ-3 గా ఉన్నాడని అతన్ని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ఇంకా ఈ కేసులో మరికొంత మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కాబట్టి భార్గవ్‌రామ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోరడంతో సికింద్రాబాద్ కోర్ట్ నిరాకరించింది.