స్క్రీనింగ్ కమిటిపైనే చంద్రబాబు ప్రిస్టేజి

రాష్ట్రంలో ఇపుడందరి దృష్టి స్క్రీనింగ్ కమిటీపైనే కేంద్రీకృమై ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమావేశమవుతున్న కమిటీ తీసుకునే నిర్ణయంపైనే చంద్రబాబు ప్రిస్టేజ్ ఆధారపడుంటుంది. 14వ తేదీన చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్నట్లుగా క్యాబినెట్ సమావేశం జరుగుతుందా ? జరగదా ? అనే విషయంలో రాష్ట్రమంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తొంది.

నిజానికి క్యాబినెట్ సమావేశం జరపాలన్నది కేవలం చంద్రబాబు పంతం తప్ప మరేమీ కాదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు క్యాబినెట్ సమావేశం జరిపకూడదనే నిబంధనలేమీ లేవు.  క్యాబినెట్ సమావేశం జరపారంటే విధానపరమైన అంశాలు చర్చించి ఆమొదం, అమలు లాంటి కీలక నిర్ణయాలుంటాయి. ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునేందుకైతే క్యాబినెట్ సమావేశమే అవసరం లేదు.

కరువు, ఫణి తుపాను, మంచినీటి ఎద్దడి, ఉపాధిహామీ పథకంపై చర్చించేందుకు క్యాబినెట్ సమావేశం పెట్టాలని సిఎస్ ను చంద్రబాబు ఆదేశించారు. నిజానికి ఈ అంశాలు ఏవీ కూడా క్యాబినెట్ పెట్టి చర్చించాల్సినంత అత్యవసరాలేమీ కావు. ఇదే అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఎల్వీ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటి మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతోంది.

క్యాబినెట్ సమావేశం పెట్టాల్సినంత అవసరం ఉందా ? అనే విషయాన్ని ఎల్వీ ఆధ్వర్యంలోని   స్క్రీనింగ్  కమిటి మొదట పరిశీలిస్తుంది. క్యాబినెట్ సమావేశం అంత అవసరం లేదని అనుకుంటే కమిటీని చంద్రబాబు డిమాండ్ ను తిరస్కరించేస్తుంది. తమకెందుకులే సమస్యని అనుకుంటే ఎలక్షన్ కమీషన్ కు పంపేస్తుంది. కాబట్టి చంద్రబాబు ప్రిస్టేజ్ ఏమవుతుందో తేలిపోతుంది.