షాకింగ్ : సర్కారు ఆఫీసులో థాయ్ మసాజ్

ఇదొక సర్కారు ఆఫీసు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రదేశం ఇది. జనాలకు సేవ చేసేందుకు ఇక్కడ ఉద్యోగులైన సేవకులు ఉంటారు. కానీ జనాలకు సేవ చేయిరి నాయనా అంటే ఇక్కడ ఉన్న ఒక పెద్ద సారు ఆఫీసులోనే అంగీ విప్పేసి తన కింద పని చేసే వ్యక్తితో మసాజ్ చేయించుకన్నాడు.  మసాజ్ టైంలో పెద్ద సారు బిజీ. ఎవరూ కలవడానికి వీలు లేదు. ఎవరైనా వస్తే తర్వాత కలువురి అని చెబుతారు.

ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? హైదరాబాద్ లోని ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్ లో. మసాజ్ చేయించుకున్న ఆఫీసర్ ఎవరనుకుంటున్నారు???  వెహికిల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి. ప్రజలకు సేవలందించాల్సిన అధికారి పట్ట పగలే ఆఫీసులో మసాజ్ చేయించుకోవడం వివాదాస్పదమైంది. రోజు మసాజ్ చేయలేక యాష్టకు వచ్చిన ఆ ఉద్యోగి అత్యంత జాగ్రత్తగా పెద్దసారు మసాజ్ చేయించుకుంటున్ సమయంలో ఫొటోలు తీయించి సోషల్ మీడియాకు వదిలారు.

ఇప్పుడు ఆ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. సురేష్ రెడ్డి బాగోతం కింద ఫొటోల రూపంలో ఉంది చూడండి.