Roja: మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే… వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం: రోజా

Roja: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయంపై తరచు వైకాపా నేతలు కార్యకర్తలు మాజీ మంత్రులు కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాజీ వైకాపా మంత్రి ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా సైతం ఇదే విషయంపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తాను. అంటూ ప్రజలందరినీ మోసం చేశారని తెలిపారు.

ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ నరకం అంటే ఏంటో చూపిస్తున్నారని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను అంటూ ఈయన ఎన్నికలకు ముందు ఎన్నో గొప్పలు పలికారు కానీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఈయన సంపద సృష్టించడం పక్కన పెట్టి అప్పులపై అప్పులు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను పక్కనపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైసిపి నేతలు కార్యకర్తలే టార్గెట్ గా చేసుకొని వారిని వేధిస్తూ వారిపై అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారని రోజా తెలిపారు. ఈ విధంగా వైసిపి నేతలు కార్యకర్తలను వేధిస్తున్న కూటమి ప్రభుత్వానికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగి ఇస్తాము అంటూ ఈ సందర్భంగా రోజా కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.