పవన్ ని ఉతకడం మొదలుపెడితే… రోజాకంటే బాగా ఎవరూ ఉతకలేరు!

పవన్ కల్యాణ్ ఏలూరు సభలో ఏపీ వాలంటీర్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి రోజా తనదైనశైలిలో ఫైరయ్యారు. మిర్చి సినిమాలో ప్రభాస్… “కత్తి వాడటం మొదలుపెడితే తనకంటే బాగా ఎవడూ వాడలేడు” అంటూ చెప్పే డైలాగ్ మదిరిగా… పవన్ ని ఉతకడం మొదలుపెడితే తనకంటే బాగా ఎవరూ ఉతకలేరు అన్నట్లుగా సాగించారు!

అవును… వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, పవన్ కు వ్యతిరేకంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మైకుల ముందుకు వచ్చిన మంత్రి ఆర్కే రోజా… పవన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్ల కాళ్లు పట్టుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతో వాళ్లే పవన్ సంగతి తేలుస్తారని హెచ్చరించారు.

ఈ సందర్భంగా పవన్ స్థాయిని గుర్తుచేసే పలు వ్యాఖ్యలు చేశారు రోజా. ఇందులో భాగంగా… “వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పవన్ పీకలేరని” అన్నారు. పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదని, ఇరిటేషన్ స్టార్ అని రోజా మండిపడ్డారు. ఇదే సమయంలో మహిళల అక్రమ రవాణా వాలంటీర్ల వల్లే జరుగుతుందంటూ మాట్లాడటం సిగ్గుచేటని చెప్పిన మంత్రి… “వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని పవన్” కు ఏ నిఘా వర్గాలు ఆ సమాచారం ఇచ్చాయని ప్రశ్నించారు.

సాక్షాత్తు ముస్సోరిలోని ఐఏఎస్ శిక్షణ కేంద్రంలో వాలంటీర్ వ్యవస్థను సిలబస్ లో చేర్చారని గుర్తుచేసిన రోజా… రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ సచివాలయానికి వెళ్లినా వాలంటీర్ల పనితీరు గురించి ఏ అక్కచెల్లెమ్మని అడిగినా గొప్పగా చెబుతారన్నారు. ఈ సందర్భంగా పవన్ కు ఛాలెంజ్ చేసిన ఆమె… నేను గెలిచిన నగరి కైనా.. “నువ్వు ఓడిపోయిన భీమవరం, గాజువాక”లకైనా.. ఏ నియోజకవర్గంలోని సచివాలయానికైనా వెళ్దాం.. నువ్వు చెప్పిన మాటకు కట్టుబడి విచారిద్దాం” అని అన్నారు.

అవును… గతంలో చంద్రబాబు వలంటీర్ వ్యవస్థపై నోటికొచ్చినట్టు మాట్లాడారని గుర్తుచేసిన రోజా… ఇప్పుడు దత్త పుత్రుడు సైతం వాళ్లపై విషం చిమ్ముతున్నాడని ఫైరయ్యారు. కోవిడ్ సమయంలో ప్రాణ భయంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారని.. ప్రభుత్వంతో కలిసి వాలంటీర్లు నిస్వార్థ్యంగా సేవలందించారని గుర్తు చేశారామె.

ఈ సందర్భంగా… సీఎంని ఏక వచనంతో మాట్లాడతానంటున్నారని.. ఆయనకు తల్లి నేర్పిన సంస్కారం అదేనా అని రోజా.. పవన్ ని ప్రశ్నించారు! ఈ సందర్భంగా… పవన్ స్థాయి ఏమిటో మరోసారి గుర్తుచేసే ప్రయత్నం చేశారు రోజా. ఇందులో భాగంగా… వైఎస్‌ జగన్‌ 36 ఏళ్లకే ఎంపీ అయ్యారని, 46 ఏళ్ళకే 151 మంది ఎమ్మెల్యేలతో రికార్డ్ విక్టరీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా… “55 ఏళ్ళు వచ్చినా ఇంకా ఎమ్మెల్యే కాదు కనీసం ఎంపీటీసీ, వార్డు మెంబర్‌ గా కూడా గెలవలేదని.. అలాంటి నువ్వు సీఎం జగన్‌ ను సింగ్లర్‌ గా పిలవడం కాదు.. దమ్ముంటే జగన్ మీద సింగిల్‌ గా పోటీ చెయ్యి” అని పవన్‌ కు రోజా సవాల్‌ విసిరారు!