RGV: రాంగోపాల్ వర్మపై ప్రస్తుతం కేసు నమోదు కావడంతో ఈయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం నేను పారిపోలేదని నేను సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాను అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వీడియోలను విడుదల చేస్తున్నారు కానీ ఇప్పటివరకు పోలీసుల ఆయనను మాత్రం అరెస్టు చేయలేదు. ఇలా రాంగోపాల్ వర్మ గురించి తరచూ ఏదో ఒక వార్త సంచలనంగా మారుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా రామ్ గోపాల్ వర్మ గురించి టిడిపి నేత బుద్ధ వెంకన్న మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంగోపాల్ వర్మ అరెస్టు భయంతోనే పారిపోయారని తెలిపారు. గత ప్రభుత్వ హయామంలో ఈయన ప్రభుత్వ అండతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేస్తూ పైశాచిక ఆనందం పొందారు.
ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నాడు. నీలో దమ్ము ఉంటే.. నిలబడు, నేను చేసింది కరెక్టు అని చెప్పు. నీకు నిజంగా సిగ్గుంటే.. ఆనాడు రెచ్చిపోయి, ఇప్పుడు దాక్కున్న నాని, వంశీ, అవినాష్ రెడ్డిల గురించి కూడా సినిమా చెయ్యి అంటూ డిమాండ్ చేశారు. తల్లి పెళ్ళాం కూతుర్ని వదిలేసిన నీకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలపడం ఏంటి అవును ఆయన కూడా తన చెల్లి అలాగే తల్లిని కూడా రోడ్డుపై వదిలేసి వచ్చారు కదా అంటూ ఈయన మాట్లాడారు.
చంద్రబాబును కించపరిచేందుకే ఇటువంటి చెత్త సినిమాలను వర్మతో జగనే తీయించాడు. అందుకే ఇప్పుడు వర్మను కాపాడాలి అంటూ ఆయనే పోస్టులు కూడా పెడుతున్నారని తెలిపారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకే సోషల్ మీడియాలో తన కార్యకర్తలు బరితెగించి పోస్టులు పెట్టారని చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి కూడా అసభ్యకర పోస్టులు చేశారని తెలిపారు. ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్ గా ఉన్న వర్మ జగన్ చెంతకు చేరగానే చీఫ్ డైరెక్టర్ గా మారిపోయారు అనవసరంగా చంద్రబాబు నాయుడు జోలికి ఎవరైనా వస్తే వారు నాశనం అవడం ఖాయం అంటూ బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.