RGV: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు!

RGV: రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈయన గతంలో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ఈయన ఇలాంటి పోస్టులు చేయడంతో ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీస్ కేసు నమోదు అయింది. ఇలా వర్మపై పోలీస్ కే నమోదు కావడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గత ఏడాది క్రితం నేను చేసిన పోస్ట్ కు ఇప్పుడు కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని నాపై కేసు పెట్టారు. అలా కేసులు పెట్టుకుంటూ పోతే సగం మంది జైల్లోనే ఉండాలి అంటూ ఈయన ఫైర్ అయ్యారు. ఇలా తనపై నమోదైన కేసు గురించి రోజుకొక వీడియోని విడుదల చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇకపోతే తనపై కేసు నమోదు కావడంతో రాంగోపాల్ వర్మ తన పై నమోదు అయిన కేసును కొట్టివేయాలి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటీషన్ ను కొట్టివేసింది.

ఇలా ఈ పిటిషన్ కొట్టి వేయడంతో ఈయన తప్పనిసరిగా అరెస్టు అవుతారని ఏ క్షణమైన వర్మ అరెస్టు కావడం తథ్యం అంటూ అందరూ భావించారు. ఇక ఈయన మాత్రం ముందస్తు బెయిలుకు అప్లై చేయగా కోర్టు మాత్రం ఈ పిటిషన్ తరచూ వాయిదా వేస్తూ వచ్చారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం కొన్ని రోజులపాటు పోలీసులు ఈయనని అరెస్టు చేయకూడదు అంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో కాస్త ఉపశమనం కలిగింది.

ఇకపోతే తాజాగా ఈయన బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు తనకు ముందస్తు బెయిల్ తీర్పు వెల్లడించింది. ఇకపోతే పోలీసులు విచారణకు పిలిచినప్పుడు తప్పనిసరిగా హాజరుకావాలని ఈ విషయంలో పోలీసుల దర్యాప్తుకు సహకరించాలి అంటూ కోర్టు ఆదేశాలను జారీచేసింది. ఇలా ఈయనకు ముందస్తు మంజూరు చేయడంతో కాస్త ఉపశమనం కలిగిందని చెప్పాలి.