ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరో సారి కేసీఆర్ కుటుంబం పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురు దొంగలు, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మధ్య కురుక్షేత్రం జరగబోతుందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానంటూ జనాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ ఎస్ ను ప్రజలు గెలిపిస్తే వాళ్లు చేసిన అభివృద్ది శూన్యమన్నారు. కేసీఆర్ కానీ, ఎంపీ కవిత కానీ నిజామాబాద్ ను ఏ రంగంలోను అభివృద్ది చేయలేదన్నారు. కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయే కానీ తగ్గలేదన్నారు. అర్దాంతరంగా అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ భవన్ లో ప్రవేశం లేకుండా చేశారన్నారు.
చేతగాక మాటలు నేర్చుకోని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావ్ అని రేవంత్ కేసీఆర్ ను విమర్శించారు. దింపుడు కల్లం ఆశ ఉన్నట్టు పదవి మీద మళ్ల గట్ట ఆశ పెట్టుకున్నారు. కేసీఆర్ రాష్ట్రంలో రాక్షస పాలన, కులాల ప్రాతిపదికన తీసుకొచ్చి పరిపాలిస్తున్నాడన్నారు.
ఈ దొర. ప్రజల జీవన విధానాన్ని విధ్వంసం చేసి, ప్రజలను బానిసలుగా చూస్తున్నాడు. దొర, దొంగ కేసీఆర్ చెప్తున్న మాటలన్నీ కూడా ఒట్టిమాటలేనని విమర్శించారు. ఈ చింతమడక చీటర్ చెప్పుతున్న మాటలను ప్రజలంతా శ్రద్దగా వినాలే ఆ చీటర్ ను సభలల్లనే విన్న వెంటనే నిలదీయాలని రేవంత్ జనాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన దొంగ కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
1200 వందల మందిని బలి తీసుకున్న రాక్షసుడు కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ తెచ్చింది తనేనని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఒక్కడన్న కేసీఆర్ కుటుంబంల తెలంగాణ కోసం సచ్చిడా అని రేవంత్ ప్రశ్నించారు. ఉస్మానియాల కాలు పెట్టె దమ్ము కేసీఆర్ కు లేదన్నారు.
నిరుద్యోగులు రోడ్ల వెంట ఉద్యోగాలు లేక తిరుగుతున్నాని లక్ష ఉద్యోగాలు వేస్తా అని చెప్పి 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఫిల్ చేసిన చీటర్ కేసీఆర్ అని రేవంత్ ఫైర్ అయ్యారు. రేవంత్ స్పీచ్ సాగుతున్నంత సేపు జనాలు ఉత్సాహం చూపారని పలువురు నేతలు చర్చించుకున్నారు.