2019 ఎన్నికల పలితాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని చాలా చాలా బాధపడ్డాయట. గుండె బద్దలైపోయేంత బాధ కలిగిందట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. తాజాగా, ఇంకోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.. అదీ వారాహి విజయ యాత్ర సందర్భంగా.
చీకట్లో చిరు దీపం తరహాలో, 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గ ప్రజలు, జనసేన పార్టీకి ఊరటనిచ్చారన్న జనసేనాని, వచ్చే ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో మిగతా నియోజకవర్గాల్లోనూ ప్రజలు జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు.
‘మన పార్టీ నుంచి గెలిచిన నాయకుడు, వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఈ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా వుంది. ప్రభుత్వానికి పదిహేను రోజులు సమయం ఇస్తున్నాను. బాగు చేస్తే సరే సరి.. లేకపోతే, నేనే వచ్చి శ్రమదానం చేస్తాను. ఆ తర్వాత ఎవరైనా ఏడిస్తే నాకు సంబంధం లేదు..’ అంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.
‘గన్నవరం నుంచి తాడేపల్లికి హెలికాప్టర్‌లో వెళుతున్న ముఖ్యమంత్రికి, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు గతుకుల రోడ్లపై పడుతున్న అవస్తలు ఎలా కనిపిస్తాయ్.?8 అంటూ జనసేనాని ప్రశ్నించారు.
అంతా బాగానే వుందిగానీ, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ని జనసేనాని ఎందుకు తమ పార్టీలో కొనసాగేలా చేయలేకపోయారు. ఒకే ఒక్క ఎమ్మెల్యేకి తగిన గౌరవం పార్టీలో ఇచ్చి వుంటే, ఆయన పార్టీ మారేవారు కాదేమో.!