AP: ఏపీ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయిన నేపథ్యంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ రోజు ఫొటో సెషన్ నిర్వహించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, యువనేత లోకేశ్ తోపాటు వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు వీరంతా ఒకే ప్రేమ్ లో కనిపించడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతం కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి అరుదైన దృశ్యాలు మన రాష్ట్రంలో కనిపించలేదు అయితే తాజాగా మరోసారి ఈ ఫోటో స్టేషన్ ప్రారంభం కావడంతో అధికార నేతలు ప్రతిపక్ష నేతలు కూడా ఒకే ఫ్రేమ్లో కనిపించడం విశేషం.వాస్తవానికి బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటో సెషన్ ఉంటుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ సంప్రదానికి ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ఫోటో సెషన్ ప్రారంభించింది.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆధ్వర్యంలో శాసనసభ్యులు, మండలి చైర్మన్ మోషేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీకు ఫొటో సెషన్ నిర్వహించారు. మొదటి వరుసలో భాగంగా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇతర మంత్రులతో పాటు వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా ఉండటం విశేషం.
తదుపరి రెండు మూడు వరుసలలో ఎమ్మెల్యేల సీనియారిటీని బట్టి అభ్యర్థులందరూ ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఫోటో సెషన్ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వీరిద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ బాగున్నారా.. అంటూ పవన్ యోగక్షేమాలపై ఆరా తీయగా పవన్ కరచాలం చేస్తూ బొత్సతో మాట్లాడారు. గత ఏడాది నవంబర్ లో సైతం పవన్, బొత్స ఆప్యాయంగా కౌగిలించుకోవడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది తాజాగా అలాంటి సంఘటన చోటుచేసుకుంది.