కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కూతురు.. ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉందా?

kavitha

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రతి పార్టీ నేతలు తమ పార్టీనే అధికారంలో ఉండాలని కష్టపడతారు. అయితే కొన్నిసార్లు ఆ కష్టానికి తగ్గ ఫలితం సులువుగానే దక్కితే మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఆ కష్టానికి తగిన ఫలితం దక్కడం కష్టమవుతుంది. అయితే కేసీఆర్ కూతురు కవిత కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియా, వెబ్ మీడియాలో జోరుగా ప్రచారంలోకి వస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం టీ.ఆర్.ఎస్ అధికారంలో ఉంది. 2024 ఎన్నికల్లో కూడా టీ.ఆర్.ఎస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పుంజుకుంటున్నా ఆ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి మాత్రం లేదనే సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో కేసీఆర్ సోదరుని కూతురైన రమ్యారావు కవిత గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయానికే కవిత బీజేపీతో సన్నిహితంగా మెలిగారని రాష్ట్రంలో టీ.ఆర్.ఎస్ అధికారంలోకి రాకపోయినా తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కవిత అడుగులు వేశారని రమ్యరావు వెల్లడించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారని రమ్యారావు వెల్లడించారు. ప్రస్తుతం కవిత కాంగ్రెస్ పై దృష్టి పెట్టారని కాంగ్రెస్ తో ఆమె లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారని రమ్యారావు చెప్పుకొచ్చారు.

రమ్యారావు వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి కవిత ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. కవిత ఈ వార్తల గురించి స్పందించని పక్షంలో ఆమె పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. కవిత సైలెన్స్ ను బ్రేక్ చేసి ఈ కామెంట్ల గురించి వివరణ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.