నిన్నమొన్నటివరకూ సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన ఆర్జీవీ.. ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేస్తున్నారు. కీలకమైన విషయాలపై డిబేట్లు పెడుతూనే… సమకాలీన రాజకీయపై ఆన్ లైన్ వేదికగా తనదైన స్పందన తెలియజేస్తుంటారు. ఇందులో భాగంగా… తాజాగా చంద్రబాబు – లోకేష్ లపై ఆన్ లైన్ వేదీకగా కీలకంగా స్పందించారు ఆర్జీవి.
రెండు రోజులుగా ఏపీలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో వాలంటీర్లు ఉమన్ ట్రాఫికింగ్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారని… ఒంటరి మహిళల వివరాలు సంఘవిద్రోహ శక్తులకు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పవన్ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఫలితంగా… పవన్ కు సామాజిక బాధ్యత లేదనే విషయం మరోసారి తేటతెల్లమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే పవన్ కల్యాణ్ వాలంటీర్లపై ఈ స్థాయిలో విమర్శలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు, మహిళా కమిషన్లు, ప్రభుత్వంలోని మంత్రులు, ఏపీ ప్రజానికం, మరి ముఖ్యంగా వాలంటీర్ల సేవలు విరివిగా పోందే వృద్ధులూ, పేద కుటుంబస్థులు… పవన్ పై ఫైరవుతున్నారు. ఇలాంటి వ్యక్తి సీఎం అయ్యి రాష్ట్రాన్ని పాలిస్తారా అంతూ వెటకారమాడుతున్నారు!
అయితే విచిత్రంగా ఇంతజరుగుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లు స్పందించలేదు. టీడీపీ నేతలంతా సైలంటయిపోయారు. పవన్ విమర్శల వల్ల క్రెడిట్ వస్తే అది తమ ఖాతాల్లో… నెగిటివ్ ఇమేజ్ వస్తే తమకు సంబంధం లేదన్నట్లుగా మిన్నకుండిపోయారు. దీంతో… ఆర్జీవీ ఆన్ లైన్ లో చంద్రబాబు, లోకేష్ లకు ఒక ట్వీట్ చేశారు. ఇద్దరికీ ఒకేరకమైన ట్వీట్ అయినప్పటికీ… చంద్రబాబుని సర్ అని సంబోధించిన ఆర్జీవీ… లోకేష్ ని బ్రో అని సంబోదించడం గమనార్హం!
“వాలంటీర్లు మహిళా అక్రమ రవాణాకు క్రిమినల్ బ్రోకర్లు” అని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో మీరు అంగీకరిస్తారా? ఆ ప్రకటనతో మీరు ఏకీభవించకపోతే ఖండించాలి కదా సార్? మీరు ఖండించని పక్షంలో మీరు కూడా పవన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారని రుజువు చేస్తుంది. ఆ విషయమైనా మీరు అంగీకరిస్తారా” అంటూ ఆర్జీవి… చంద్రబాబు – లోకేష్ లపై ట్వీట్ చేశారు. విచిత్రంగా… ఈ విషయంపై ఒక్క టీడీపీ నేతకానీ, ఆ వర్గం మీడియా కానీ స్పందించకపోవడం గమనార్హం!!
అంటే… ఆర్జీవి సంధించిన ప్రశ్న ప్రకారం… చంద్రబాబు – లోకేష్ ల మౌనమే అంగీకారం అన్నమాట!!