రజనీకాంత్ రాజకీయ పార్టీ వచ్చేస్తుందా ?

రజనీకాంత్ రాజకీయ పార్టీ వచ్చేస్తుందా?


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లో రాజకీయ అలజడి , వేడి ప్రారంభమైనట్టు కనిపిస్తుంది . సంక్రాంతో లోపు రాజకీయ పార్టీని ప్రారంబిస్తున్నదని , ఆ వెంటనే జెండా , ఎజండా ప్రకటిస్తాడని రజనీ సన్నిహిత మిత్రుడు త్యాగరాజన్ వ్యాఖ్యానించారు . గత కొంతకాలంగా రజనీ రాజకీయ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి . కానీ రజనీ నోరు విప్పడం లేదు . మొన్న జరిగినలోక్ సభ ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారని భావించారు . కానీ రజనీ మాత్రం మౌనంగా వున్నారు . అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ ఖచ్చితంగా పోటీ చేస్తారని అంటున్నారు .


సంక్రాంతి పండుగ లోపునే రజనీకాంత్ పార్టీ ప్రకటిస్తారని తెలుస్తుంది . తమిళనాట జయలలిత , కరుణానిధి తరువాత రాజకీయ శూన్యత అలాగే ఉందని , దానిని రజనీ మాత్రమే పూరించగలడని ఆయన సన్నిహితులు అంటున్నారు . రజనీకాంత్ ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ , హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సన్నిహిత సంబంధాలు కలిగివున్నాడని , కాబట్టి రజనీ భారతీయ జనతా పార్టీ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు . అయితే తమిళనాట భారతీయ జనతా పార్టీ అంటే ఉత్తరాది పార్టీ అనే అభిప్రాయం వుంది . అందుకే పొత్తు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి అడుగేస్తారని అనుకుంటున్నారు . ఏమైనా రజనీకాంత్ మొత్తానికి రాజకీయ అరంగేట్రానికి సిద్దమవుతున్నాడన్న మాట .