గోవా సీఎం పారికర్ తో రాహుల్ గాంధీ సమావేశం

గోవా సీఎం మనోహర్ పారికర్ తో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. గోవా అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్ లో రాహుల్ పారికర్ తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఏమేం చర్చలు జరిగాయన్న విషయం తెలియలేదు. గతంలో రాఫేల్ డీల్ కు సంబంధించిన కీలక పత్రాలు పారికర్ బెడ్రూంలో ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పడు తీవ్ర దుమారాన్ని రేపాయి.

పారికర్ తో తాను మర్యాద పూర్వకంగానే బేటి అయ్యానని రాహుల్ అన్నారు. ఆయన అనారోగ్యంగా ఉండడంతో సాటి మనిషిగా కలిసి ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నానని ఆయన త్వరగా కోరుకోవాలని రాహుల్ ఆకాంక్షించారు.

రాఫేల్ ఒప్పందం పై రాహుల్ ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన కేవలం ఆరోగ్య పరిస్థితి వాకబు చేశారని గోవా విపక్ష నేత చంద్రకాంత్ అన్నారు. మనోహర్‌ పారికర్‌ పాంక్రియాటిక్‌ వ్యాధితో బాధపడుతూ 2018 ఫిబ్రవరి నుంచి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.