R.K palukulu: చంద్రబాబు పాలన పై రాధాకృష్ణ సెటైర్స్.. తీరికలేదు.. దమ్మడి ఆదాయం లేదంటూ?

R.K palukulu: సీనియర్ జర్నలిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధాకృష్ణ ఇటీవల ఆర్కే కొత్త పలుకులు అంటూ ప్రతి ఆదివారం ఒక ప్రత్యేకమైన సంచిక ద్వారా ఎన్నో విషయాలను ఈయన తెలియజేస్తూ ఉంటారు. ఈయన ఆర్కే పలుకుల ద్వారా ఒక విషయాన్ని వెల్లడించారు అంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ వారం కొత్త పలుకులలో భాగంగా ఈయన అల్లు అర్జున్ అరెస్టు గురించి ప్రస్తావిస్తారని అందరూ భావించారు కానీ ఎక్కడా కాని ఈ ఊసే ఎత్తలేదు.

ఇకపోతే ఆర్కే పలుకులలో భాగంగా ఈయన చంద్రబాబు నాయుడు పై కాస్త విమర్శిస్తూనే రాసిన ఈ సంచిక ప్రస్తుతం సంచలనంగా మారింది. చంద్రబాబు నాయుడు 6 నెలల పాలన పై ఈయన తన నివేదికను ఇలా వెల్లడించారు.నాయకుడుంటే నరేంద్ర మోడీ లాగా ఉండాలని.. అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ లాగా ఎదిరించాలని చంద్రబాబుకు రాధాకృష్ణ హితబోధ చేశాడు. నరేంద్ర మోడీ ప్రశాంతంగా ఉంటారని ఆయన చేయాల్సిన సమయంలో అన్ని పనులు చేస్తారని తెలిపారు..

ఇక గంటల తరబడి అధికారులను ఓచోట కూర్చోబెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటివి నరేంద్ర మోడీ ఇవ్వరని నాయకుడు అంటే అలాగా ఉండాలని ఈయన చంద్రబాబు నాయుడుకి సూచించారు.ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబులో పాతవాసనలు పోలేదని.. స్వర్ణాంధ్ర 2047 వంటి వాటితో ఉపయోగం లేదని.. భవిష్యత్తు ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని రాధాకృష్ణ సూక్తి ముక్తావళిని వినిపించాడు. ఇలా గంటల తరబడి అధికారులతో సమావేశాలు అంటూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అంటూ కాలయాపన చేస్తే క్షణం తీరికలేకుండా.. దమ్మిడి ఆదాయం లేకుండా వ్యవహారం కొనసాగుతుందని ఈయన తన మనసులో భావాలను ఇలా బయట పెట్టారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది వైకాపా నాయకులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు అయితే అలాంటి వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడ కూడా అదే చేస్తున్నారని మండిపడ్డారు. ఏది ఏమైనా ఆర్కే తన కొత్త పలుకులలో చంద్రబాబు నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.