వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మె ల్యే ఉప్పలేటి కల్పనకు పామర్రు నియోజకవర్గం టికెట్ ఇవ్వడం మీద టిడిపిలో తిరుగుబాటు మొదలయంది. ఎమ్మెల్యే కల్పన అభ్యర్తిత్వం మీద అసమ్మతి గళం ఎత్తారు.
అసమ్మతిదారులంతా కార్లతో హడావిడి సృష్టించారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదలిస్తూ వ్యతిరేకులంతా ఆమరావతికి కార్లలో పరుగుదీశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి తిరుగుబాటు దారులు 30 కార్లలో 160 మంది ఉండవల్లికి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే కల్పన ను ఎంపిక చేయడం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత బయటకు వచ్చి ఆమె పనితీరును దుయ్యబట్టారు.ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని, దీనికోసం స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించారు. వారిని టిడిపి ఎలా మచ్చిక చేసుకుంటుందో చూడాలి. ఉప్పులూరి కల్పన వైసిపి నుంచి 2016 డిసెంబర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. మళ్లీ ఆమెకే పెద్ద పీట వేయడం ఏమిటని, పార్టీ లో విధేయతఅనేదానికి గుర్తింపు ఉండదా అని వారు ప్రశ్నిస్తున్నారు,
నిజానికి కల్ప తెలుగుదేశంపార్టీ సభ్యురాలే. టిడిపి టికెట్ మీదే 2004,2009 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయారు. 2014 ఎన్నికల ముందు ఆమె వైసిపిలోకి మారారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.అయితే రెండేళ్లలోనే ఆమె మళ్లీ ‘పాత అడ్రసు’ కే వచ్చారు.
ఆమె పార్టీ విడిచి వెళ్లి పోయాక, టిడిపిలో మరొక వర్గం టికెట్ మీద ఆశపెట్టుకుని పని చేస్తూ వచ్చింది. ఈ రెండు వర్గాల మధ్య గొడవలు నడుస్తూనే ఉన్నా అవెపుడూ ఉధృతంగా బయటపడలేదు. ఇపుడు కల్పనకే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించడం తో టికెట్ మీద ఆశపెటుకున్న వర్గం తిరుగుబాటు చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడులను కలసి తమ నిరసన వ్యక్తం చేశారు.
‘తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన మేం. కష్టకాలంలో పార్టీని వదలిపోయి, పార్టీ అధికారంలోకి రాగానే తిరిగొచ్చిన కల్పన కు టికెట్ ఇవ్వడం సబబు కాదు. నేతల తీరు సరిగా లేదు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిపై అసంతృప్తి ఉంది,’ అని టిడిపికి చెందిన కన్నెకంటి జీవరత్నం, నర్వనేని మురళి, వేల్పుల రమేష్ లు చెబుతున్నారు. నాకు సీటు ఇవ్వకపోతే, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కన్నెకంటి జీవరత్నానికి టికెట్ హెచ్చరించారు.
.