సమసిన పామర్రు, పెడన తెదేపా పంచాయతీ

మొత్తానికి క్రిష్ణా జిల్లా పామర్రు, పెడన టిడిపి సిటింగ్ లు పంతం నెగ్గించుకున్నారు. ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించినా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకే పామర్రు టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

ఉప్పులేటి కల్పన

అలాగే పెడన సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత తనయుడు కృష్ణప్రసాద్ కు కేటాయించారు. పెడన అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేరును ఖరారు చేయటంతో బందరు పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అభ్యర్థిత్వంపై నెలకొన్న సందిగ్థతకు తెర పడింది.

కాగిత కృష్ణ ప్రసాద్

ఇప్పటి వరకు కాగితను పక్కన పెట్టి పెడన అసెంబ్లీ నుండి కొనకళ్ళ (బ్యానర్ పోటో) ను బరిలో నిలపి బందరు పార్లమెంట్ స్థానాన్ని ఇటీవల టీడీపీలో చేరిన వంగవీటి రాధాకృష్ణకు కేటాయించాలని చంద్రబాబు  భావించారు.ఇదే విషయమై ఐదు రోజులుగా విడతల వారీగా చంద్రబాబు పార్టీ శ్రేణులతో చర్చించారు. చివరకు పెడన టికెట్ ను కాగిత తనయుడుకే కేటాయించటంతో ఇప్పటి వరకు సాగిన ఊహాగానాలకు తెరపడింది. నేడు ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన మొదటి లిస్టులో కృష్ణా జిల్లా లో ఉన్న పదహారు నియోజకవర్గాలలో 14 ప్రకటించి ,పెడన ,పామర్రు పెండింగ్‌లో పెట్టారు.ఇపుడు పామర్రు సిట్టిగ్ శాసన సభ్యురాలు ఉప్పలేటి కల్పన కు కేటాయించారు. దీనితో జిల్లా లో అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రక్రియ పూర్తి చేసినట్లయింది.