డబ్బులకన్నా మాటే  ముఖ్యమని చెప్పిన జగన్

ఇపుడిదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే,  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఈరోజే జనసేనలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, రావెల అసలు చేరుదామనుకున్నది వైసిపిలోనే. కాకపోతే అక్కడ టిక్కెట్టు వచ్చే అవకాశం లేదని తెలుసుకున్న తర్వాతే జనసేన వైపు చూశారన్న విషయం వాస్తవం. నిజానికి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రావెల మంచి దూకుడు స్వభావం ఉన్న నేత. అందులోను ఉన్నతాధికారిగా పనిచేశారు. కాబట్టి తెలుగు, ఇంగ్లీషు భాషలపై మంచి పట్టున్న నేత కూడా. రావెల లాంటి వాళ్ళు ఏ పార్టీలో చేరినా బాగానే ఉంటుంది. కాకపోతే చంద్రబాబునాయుడుతో చెడిన కారణంగానే టిడిపిలో నుండి బయటకు రావాల్సొంచ్చింది.

 

వైసిపిలో చేరాలనుకున్న రావెల ప్రత్తిపాడులో టిక్కెట్టు కోసం ప్రయత్నించారు. అయితే గడచిన నాలుగున్నరేళ్ళుగా పార్టీకోసం పనిచేస్తున్న మాజీ ఎంఎల్ఏ మేకతోటి సుచరిత ఉన్న కారణంగా రావెలకు టిక్కెట్టు కుదరదని చెప్పారు జగన్. అయితే తనకు గనుక టిక్కెట్టిస్తే పార్టీకి భారీగా ఫండ్ ఇస్తానని ప్రతిపాదించారట రావెల. అంతేకాకుండా పార్టీకోసం కూడా తాను ఎంతైనా ఖర్చు పెట్టగలనని చెప్పారట. అయితే, రావెల ప్రతిపాదనను జగన్ సున్నితంగా తిరస్కరించారట. తనకు డబ్బులు కన్నా ఇచ్చిన హామీనే ముఖ్యమని తేల్చి చెప్పేశారట.

 

దాంతో చేసేది లేక పక్కనే ఉన్న తాడికొండ నియోజకవర్గంలో అయినా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అడిగారట. దానికి కూడా జగన్ కుదరదని చెప్పారట. తాడికొండలో డాక్టర్ శ్రీదేవికి టిక్కెట్టిస్తానని హామీ ఇచ్చినందు వల్ల ఇక్కడ కూడా టిక్కెట్టు సాధ్యం కాదని స్పష్టం చేశారట. దాంతో ఏం  చేయాలో రావెలకు అర్ధం కాలేదు. తర్వాత ఆలోచించుకుని ఎలాగూ టిక్కెట్టు అవకాశం లేని కారణంగా వైసిపిలో ఎందుకని చివరకు జనసేనలో చేరారట రావెల. ఇదే విషయం ఇఫుడు జగన్-చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను పోల్చుతూ పోస్టులు చక్కర్లు కొడుతోంది.