అంచనాలు అందుకోవడంలో ఫెయిలవుతున్న పీకే.. నమ్మకం కోల్పోయారా?

Will Prashant Kishore Make Everyone As Winner?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పీకే అనే పేరు వింటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారనే సంగతి తెలిసిందే. అయితే రాజకీయ నేతలకు మాత్రం పీకే అంటే ప్రశాంత్ కిషోర్ గుర్తొస్తారు. ప్రశాంత్ కిషోర్ ఏదైనా పార్టీ కోసం పని చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలామంది భావిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో పీకేను నమ్మేవాళ్ల కంటే నమ్మని వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అంచనాలు అందుకోవడంలో పీకే ఫెయిల్ అవుతుండటం ఇందుకు కారణమని చెప్పవచ్చు.

ప్రముఖ రాజకీయ నేతలు పీకేపై విశ్వాసం కోల్పోవడం ఆయనకు మైనస్ అయింది. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ఒకప్పుడు సంచలనం కాగా ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. ఇప్పటివరకు పీకే గెలిచే పార్టీకి ప్రచారం చేశారని అదే ఆయనకు ప్లస్ అయిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం పీకే దగ్గర పని చేసిన వాళ్లు ఐ ప్యాక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తను ఆ బాధ్యతలను నిర్వహించి పార్టీ అధికారంలోకి రాకపోతే తనపై నెగిటివ్ కామెంట్లు వస్తాయని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ కోసం పని చేయాలని ప్రశాంత్ కిషోర్ భావించినా ఇక్కడ షాక్ తగలడంతో ప్రశాంత్ కిషోర్ వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో తనకు ప్రచారం లభించడంలో ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయిలో ఫెయిల్ కావడంతో టీ.ఆర్.ఎస్ పార్టీ ఆయన సేవలను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపలేదు.

ప్రశాంత్ కిషోర్ చరిత్ర ముగిసినట్లైనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పీకే వ్యూహాలను నమ్ముకుంటే నష్టం తప్ప లాభం ఉండదని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. సొంత వ్యూహాలతోనే ముందుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. వ్యూహాల విషయంలో కేసీఆర్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి.