వైరల్ ఇష్యూ… పీకే మ్యాజిక్ మాటలు – నెటిజన్ల లాజిక్ ప్రశ్నలు!

ఏపీలో జగన్ ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే చంద్రబాబు, పవన్, లోకేష్, పురందేశ్వరి, షర్మిళ, ఎల్లో మీడియా మొత్తం కలిసి జగన్ ని గెలవాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ప్రశాంత్ కిశోర్ (పీకే) ఎంటరయ్యారు.

ఈ సమయంలో తాజాగా ప్రశాంత్ కిశోర్.. ఏపీలో ఎన్నికల ఫలితాలపై చెప్పిన జోస్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో జగన్ గెలవడం అసాధ్యం అంటూ పీకే చెబుతున్న కారణాలు ఏమిటి.. వాటికి కొన్ని లాజిక్కులు లాగుతూ నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం…!

పీకే మ్యాజిక్:

“ఐదేళ్లుగా కేంద్రంలోని బీజేపీకి అనేక అంశాల్లో జగన్ బేషరుతుగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే బీజేపీ, టీడీపీ వైపు చూస్తుంది. దీంతో భాగస్వాములను ఎంచుకోవడంలో జగన్ ఎలాంటి తప్పటడుగులు వేశారో అర్ధమవుతుంది. బీజేపీని జగన్ గుడ్డిగా సమర్ధించారు”!

నెటిజన్ల లాజిక్:

నిజంగా కేంద్రంలోని బీజేపీకి జగన్ మద్దతివ్వడం తప్పు అని అంటున్నారంటే… బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పుడివే అని పీకే చెప్పాలనుకున్నారా..?

అదే నిజమైతే… అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పార్టీతో జతకట్టాలనుకునేవారిని ఏమనాలో పీకే చెప్పగలరా?

ఒకవేళ బీజేపీ నిర్ణయాలు సరైనవే అయితే… కేంద్రంలోని ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటికి మద్దతివ్వడం రాష్ట్రాల బాధ్యత కాదా?

పీకే మ్యాజిక్:

“జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలకు తాయిలాలు ఇవ్వడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు.. అది ఏపీ వంటి మిడిల్ ఇన్ కం రాష్ట్రాల్లో సరైన నిర్ణయం కాదు.. 50 శాతానికి పైగా పట్టణ ప్రజలున్న ఏపీ వంటి రాష్ట్రాల్లో జగన్ అనుసరించిన విధానం కరెక్ట్ కాదు..”!

నెటిజన్ల లాజిక్:

పేద ప్రజలకు అందించే సంక్షేమ ఫలాలు, వృద్ధులకు అందించే “పించన్”, పిల్లలు పనిలోకి పోకుండా బడిలోకి వెళ్లాలని వారి తల్లులకు ఇస్తున్న “అమ్మఒడి”, రైతులకు అందించే “రైతు భరోసా”, మధ్యవయసు మహిళలకు అందించే “చేయూత” మొదలైన పథకాలను తాయిలాలు అని సంభోదిస్తున్న పీకే… తాము అధికారంలోకి వస్తే అంతకంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు (పీకే దృష్టిలో తాయిలాలు) ఇస్తామని చెబుతున్న పార్టీలు మాత్రం ఎలా గెలుస్తాయని చెప్పాలనుకుంటున్నారు?

నిజంగా జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల లాభం ఏమీ లేకపోతే… మరి ఆ పథకాలను కొనసాగిస్తూ, వాటి స్థాయిని విస్తరిస్తూ, మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతామని.. అమ్మఒడి లాంటి పథకాలూ ఒక్కరికి కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ అని చెబుతున్న పార్టీల కబుర్లు పీకే చెబుతున్న అదే పట్టణ ప్రజానికం వింటారా? వినకపోతే జగన్ గెలవరని ఎలా చెబుతారు? వింటే… అసలు తాను చెప్పిన మాటకు అర్ధమే లేనట్లు కదా?

పీకే మ్యాజిక్:

“రాజధానిని నిర్మించడం, ఫ్యాక్టరీలు కట్టడం, రోడ్లు వెయ్యడం వంటివి అనవసరమనే భావనలో జగన్‌ ఉంటారు”!

లాజిక్ క్వశ్చన్స్:

నిజంగా జగన్ అలానే భావిస్తే… “నాడు – నేడు” పథకం ఎందుకు తెస్తారు? స్కూలు పిల్లలకు ఓట్లు ఉండవు కదా?

ఇదే సమయంలో స్వాతంత్రం వచ్చాక ఏపీలో గతంలో ఎన్నడూ లేనన్ని మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టినట్లు.? పోర్టులు, విమానాశ్రయాలు ఎందుకు నిర్మిస్తున్నట్లు?

పీకే మ్యాజిక్:

“సొంత కుటుంబ వ్యహారాల్లోనూ జగన్ తప్పటడుగులు వేశారు.. మరి తప్పులు చేసినప్పుడు మూల్యం చెల్లించక తప్పదు”!

నెటిజన్ల లాజిక్:

అసలు కుటుంబ వ్యవహారలను ఏపీ ప్రజలు పరిగణలోకీ తీసుకుని ఉంటే… సొంతమామ ను వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమనే పేరున్న వ్యక్తిని గతంలో ఎందుకు గెలిపించినట్లు.?

సొంత అన్న కొడుకు.. తన తాత సమాధి వద్దకు వచ్చినప్పుడు తన ఫ్లెక్సీలు తప్ప, అతడి ఫ్లెక్సీలు వెంటనే తీయాలని హుకుం జారీ చేయడాన్ని ఎలా చూడాలి..?

… ప్రస్తుతం ఈ చర్చ నెట్టింట వైరల్ గా మారుతుంది!