ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా “ఆదిపురుష్” వైబ్రేషన్ మొదలైపోయాయి. ఇక ఇండియాలో ఫ్యాన్స్ అందరికీ పండగ వాతావరణం నెలకొంది. “ఆదిపురుష్” థియేటర్స్ అన్నీ “జై ప్రభాస్.. జిందాబాద్ రెబల్స్ స్టార్” నినాదాలతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక ట్విట్టర్ రివ్యూలు, మెయిన్ రివ్యూలూ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక డైలాగ్ సోషల్ మీడియా వేదికగా మరోసారి తెరపైకి వచ్చింది.
“ఆదిపురుష్” టీజర్ రిలీజ్ అయిన తరువాత ప్రభాస్ వీడియో ఒకటి వైరల్ అయింది. “వేర్ ఈజ్ ఓం.. ఓం కం టు మై రూం” అంటూ ప్రభాస్ సీరియస్ గా పిలిచినట్లు కనిపిస్తుంది. “ఆదిపురుష్ టీజర్ బాగా లేకపోవడంతో ప్రభాస్ సీరియస్ అయ్యాడు.. ఓం రౌత్ కు వార్నింగ్ ఇచ్చాడు” అంటూ ఆ వీడియో గురించి కామెంట్ చేస్తూ అప్పట్లో వైరల్ చేశారు.
ఈ క్రమంలో తాజాగా మరోసారి థియేటర్ లో సినిమా చూసి, అభిమానుల ప్రేక్షకుల స్పందన చూసిన అనంతరం ప్రభాస్ స్పందన ఇలానే ఉంటుంది అంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు. సినిమా రిజల్ట్ చూసిన అనంతరం ప్రభాస్.. డైరెక్టర్ ఓం రౌత్ ని మరోసార్ “ఓం కం టు మై రూం” అని పిలుస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాకపోతే అప్పట్లో టీజర్ బాలేదని చెప్పడానికి సీరియస్ గా పిలిస్తే… ఈసారి సినిమా బాగుందని అభినందిస్తూ పార్టీ ఇవ్వడానికి పిలుస్తారని అంటున్నారు.
కాగా… వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా రూపొందింది “ఆదిపురుష్”. మర్యాద పురుషోత్తముడైన రాఘవ వనవాసం స్వీకరించడం నుంచి కథ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది!
ఈ సినిమాలో రాఘవగా ప్రభాస్.. తన అర్ధాంగి, అపురూప సౌందర్యవతి అయిన జానకి పాత్రలో కృతిసనన్.. శత్రు దుర్భేద్యమైన లంకని ఏలుతున్న లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవ్ దత్ లు పాత్రలకు ప్రాణం పోశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి!