ఏసీబీ కోర్టు జడ్జిపై పోస్టులు… రాష్ట్రపతి భవన్ సీరియస్!

ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారిస్తున్న న్యాయమూర్తి హిమబిందు పై సోషల్ మీడియాలో కొంతమంది పోస్టింగులు పెడుతున్నారు. అవి న్యాయమూర్తిని అగౌరవపరిచేలా అత్యంత అసభ్యకరంగా ఉంటున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ పోస్టింగ్స్ పై రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ విషయంపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది.

మహిళా న్యాయమూర్తిపై పెడుతున్న అసభ్యకరమైన పోస్టింగులు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి సూచిస్తే రాష్ట్రపతి కార్యదర్శి లేఖ రాసారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి పీ.సీ మీనా సీరియస్ గా రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించినప్పటీ నుండి ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అయితే… తమ నేతను జైలుకు పంపారన్న ఆగ్రహంతో ఆమెను కించపరుస్తూ టీడీపీ కార్యకర్తలు ఆ పనికి పూనుకున్నారని అంటున్నారు! దీంతో రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదులు అందాయి.

ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు న్యాయవాదులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసారు. అటువంటి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇదే సమయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది రామానుజం ఈ పోస్టింగ్స్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసారు. ఒక మహిళా జడ్జిని కించపర్చేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా… చంద్రబాబు స్కిల్ స్కాం కేసు సీఐడీ విచారిస్తుండటంతో ఈ వ్యవహారం ఏసీబీ కోర్టు పరిధిలో ఉన్నసంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఏసీబీ కోర్టు జడ్జి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా చంద్రబాబును విచారించారు. జైలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీసారు. ప్రస్తుతం మీపై ఉన్నవి ఆరోపణలే అని.. నిర్దారణ కాలేదని పేర్కొన్నారు. రిమాండ్ లో ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్లు దని చెచ్చిన సంగతి తెలిసిందే.