గతకొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన “బ్రో” సినిమాకు సంబంధించిన వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్యాంబాబు పాత్ర పట్ల ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఫైరవుతున్నారు. పవన్ ను వాయించి వదులుతున్నారు. ఈ సమయంలో పూనం కౌర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెను సిస్టర్ అంటూ అర్జీవీ కూడా ఎంటరయ్యారు.
బ్రో సినిమాలో శ్యాంబాబు అనే పాత్రను సృష్టించి తనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారని అంబటి రాంబాబు గతకొన్ని రోజులుగా పవన్ పై ఫైరవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయంగా తనకు ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేసి ఆనందిస్తున్నాడని అన్నారు. ఇలాంటి ఆనందాన్ని శునకానంధం అంటారు అంటూ గట్టిగా ఇచ్చిపడేశారు.
ఇదే సమయంలో తాను కూడా ఒక సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. దీనికోసం కొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ సినిమాకు సంబంధించిన కథ లైన్ చెప్పిన అంబటి… తాళి – ఎగతాళి, పెళ్లి – పెటాకులు, బహు భార్యా కోవిధుడు మొదలైన టైటిల్స్ ని బయటపెట్టారు. ఈ విషయంలో ఎవరైనా సలహాలూ సూచనలూ ఇస్తే తీసుకుంటామని అన్నారు.
ఇలా అంబటి వర్సెస్ బ్రో గా రచ్చ నడుస్తోన్న సమయంలో నటి పూనం కౌర్ స్పందించిన విషయం తెలిసిందే. రాజకీయాలు ఎంటర్టైనింగ్ గా, ఎంటర్టైన్మెంట్ కాస్తా సో సీరియస్ గా మారాయంటూ ఆమె చురకలు అంటిస్తూ ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. దీంతో తాజా రాజకీయాలు, బ్రో సినిమా వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె సెటైర్లు వేశారనే కామెంట్లు వినిపించాయి.
ఈ సమయంలో ఆర్జీవీ ఎంటరయ్యారు. అవును… పూనం కౌర్ ట్వీట్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ట్విట్టర్ ద్వారానే పూనమ్ కౌర్ కు రిప్లై ఇచ్చారు. రాజకీయాలు ఎంటర్టైనర్ గా మారాయంటూ చేసిన వాదనలతో ఏకీభవించట్లేదని అన్నారు. “నో సిస్టర్..” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు ఆర్జీవీ. “రాజకీయాలు సినిమాలుగా.. సినిమాలు రాజకీయంగా తయారయ్యాయని” కామెంట్స్ పెట్టారు.
అయితే ఆర్జీవీ, పూనం ట్వీట్ల బంధంపై జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడం గమనార్హం. పవన్ ఫ్యాన్స్ సైతం పూనం విషయంలో కక్కలేక మింగలేక ఇబ్బందిపడుతున్నారని అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగబోతోందనేది వేచి చూడాలి.