పదేళ్ళపాటు అరాచక ఎంఎల్ఏగా పాపులరైన మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. పోలవరం కుడి కాలువ నుండి తమ పొలాలకు నీళ్ళు తెచ్చుకునేందుకు రైతులు ఏర్పాటు చేసిన పైపు లైన్లను చింతమనేని దొంగతనం చేశారట.
విషయం ఏమిటంటే దెందులూరు నియోజకవర్గంలోని జానంపేట గ్రామంలో రైతులు తమ పొలాలకు నీళ్ళ కోసం పైపులైన్లు ఏర్పాటు చేసుకున్నారు. పోలవరం కుడికాలువలో నుండి తమ పొలాలకు నీళ్ళు తెచ్చుకునేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్నారు.
మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది కదా ? అందులోను చింతమనేని కూడా ఓడిపోయారు. దాంతో రైతులపై చింతమనేనిలో అక్కసు పెరిగిపోయింది. అందుకనే రాత్రికి రాత్రి రైతులు ఏర్పాటు చేసుకున్న పైపు లైన్లను దొంగతనం చేశారట. ఆ మేరకు రైతులు పెదవేగి పోలీసు స్టేషన్ లో చేసిన ఫిర్యాదుతో మాజీ ఎంఎల్ఏపై కేసు నమోదు చేశారు.
పార్టీ ఓడిపోయినా, తాను ఓడిపోయినా చింతమనేని బుద్ది మారలేదని అర్ధమవుతోంది. నిజానికి టిడిపి మొత్తం మీద అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ముందుగా చింతమనేని పేరు చెప్పుకుంటారు. అలాంటిది అధికారంలో లోకేపోయినా తాను అరాచకాలను కంటిన్యు చేస్తే ఎవరూ ఒప్పుకోరన్న జ్ఞానం కూడా మాజీ ఎంఎల్ఏలో లోపించింది. అదేమంటే ఆ పైపులను తాను రైతులకు కొనిచ్చానంటున్నారు. నిజమే అనుకున్నా ఆ పైపులను తీసుకెళ్ళి చింతమనేని ఏం చేసుకుంటారు ?