పీకే అంటే పిచ్చి కుక్క, ప్యాకేజీ కళ్యాణ్.. పెళ్ళిళ్ళ కళ్యాణ్: మంత్రి అమర్నాథ్.!

‘ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రవర్తన..’ అంటూ నేషనల్ మీడియాకి చెందిన ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియా వేదికగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై ఆసక్తికరమైన ట్వీటేశారు. అందుక్కారణం గుడివాడ అమర్నాథ్ వేసిన ట్వీట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ‘పిచ్చి కుక్క..’ అని సంబోదిస్తూ గుడివాడ అమర్నాథ్ ఓ ట్వీటేశారు.

‘పీకే అంటే పిచ్చికుక్క.. పీకే అంటే ప్యాకేజీ కళ్యాణ్.. పీకే అంటే పెళ్ళిళ్ళ కళ్యాణ్..’ అంటూ గుడివాడ అమర్నాథ్ ట్వీటేయగా, దాన్ని నేషనల్ మీడియాకి చెందిన ఓ జర్నలిస్ట్.. ‘రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో ఇలా తగలడ్డాయ్’ అని పేర్కొంటూ హైలైట్ చేశారు.

రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. కానీ, విమర్శలు చేయడానికీ ఓ పద్ధతి వుండాలి. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ.. ఇలా కీలక పదవుల్లో వున్న వ్యక్తులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. గుడివాడ అమర్నాథ్ కేవలం వైసీపీ నాయకుడు మాత్రమే కాదు.. ఓ ఎమ్మెల్యే, పైగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ‘యెదవల్లారా.. సన్నాసుల్లారా.. చెప్పుతో కొడతా..’ అనడం సబబు కాదు. ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఆయన సైతం హుందాగా వ్యవహరించాల్సిందే. కాకపోతే, ఆయన ప్రజా ప్రతినిథి కాదు. చట్టసభలకు ప్రాతినిథ్యం వహించడంలేదు. ఆ రకంగా ఆయనకు కొంత వెసులుబాటు వుంది.

వైసీపీలో చాలామంది నాయకులున్నారు.. అలాంటోళ్ళు, గుడివాడ అమర్నాథ్ తరహాలో పవన్ కళ్యాణ్‌ని తిడితే అది వేరే లెక్క. మంత్రి పదవిలో వుండి తాను దిగజారుడుతనం ప్రదర్శించకూడదని తెలుసుకోకపోతే ఎలా.? ఓ రాష్ట్ర మంత్రి ఇంత నీఛంగా వ్యవహరిస్తాడా.? అన్న చర్చ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్లో జరుగుతుంది.

అధినేత మెప్పు ఇలాంటి విషయాలతో సంపాదించగలమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.