SVSN Varma Vs Nagababu: పిఠాపురంలో ఆగని ఆది పత్య పోరు ఈసారి వర్మ వర్సెస్ నాగబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన ప్పటి నుంచి అక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అప్పటికే పిఠాపురంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన ఎస్వీఎస్ఎన్ (శ్రీ వత్సవాయి సత్యనారాయణ) వర్మ… పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ససేమిరా అంగీకరించలేదు. అయితే పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కు పిఠాపురం సీటు కేటాయించడానికి వర్మను చంద్రబాబు బుజ్జగించారు. పవన్ కళ్యాణ్ విజయానికి కలిసి పని చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో వర్మ అనివార్యంగా పిఠాపురం సీటును పవన్ కు త్యాగం చేయాల్సి వచ్చింది.

అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినప్పటికీ పిఠాపురంలో మాత్రం వర్మ పెత్తనం సాగుతోంది. ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ ఇక్కడ జనానికి అందుబాటులో లేకపోవడమే అంటారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ఆయన కేవలం ఇప్పటికి ఎనిమిది రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్నారని టిడిపి వర్గీయులు లెక్కలు చెబుతున్నారు కూడా. ఒకసారి ఎమ్మెల్యేగా పని చేయడం, నియోజకవర్గం లో మంచి పట్టు ఉండడంతో వర్మ వర్మ సహజంగానే ఇక్కడ పై చేయి సాధించారు. ఇది జనసేన స్థానిక నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదు. నియోజకవర్గ స్థాయి అధికారులు నియామకాల్లోనూ, పలు దేవాలయాల పాలకవర్గాల నియామకాల్లోనూ వర్మ పెత్తనాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఆయా నియామకాల్లో తమ పార్టీ నాయకులులకు కూడా అవకాశం కల్పించాలని వర్మతో తగువులకు దిగుతున్నారు.

Posani Krishna Murali: మళ్ళీ రిమాండ్.. కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్న పోసాని కృష్ణమురళి

ఇక్కడ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి, మరికొందరు వర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఒక ఎస్ఐ నియామకంలో అయితే స్వయంగా నాగబాబు జోక్యం చేసుకొని వర్మ ప్రతిపాదించిన వ్యక్తిని కాకుండా జనసేనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని నియమించేలా చేశారు, ఇదే కాకుండా వివిధ ఉత్సవాల నిర్వహణలో గాని, పండగలు, పార్టీ కార్యక్రమాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు సమయాల్లో కూడా పిఠాపురంలో టిడిపీ, జనసేన నాయకులు మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. తాజాగా ఈ పోరు కొత్త రూపు తీసుకుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాల నుంచి ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి నాగబాబుకి ఇవ్వాలా వర్మకు ఇవ్వాలా అన్న సంశయాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబు తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విశ్వసనీయంగా తెలియ వచ్చింది.

పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన నాగబాబుకి నామినేటెడ్ పదవి ఇవ్వాలన్న అంశం ఎప్పటి నుంచో నలుగుతోంది. నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని జనసేన నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు బిఆర్ నాయుడు తెరపైకి తెచ్చి నాగబాబుకి చెక్ చెప్పారు.

అలాగే గతంలో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడగా అందులో ఒకటి నాగబాబు ఖాయం అని జనసేన నాయకులు అనుకున్నారు. అయితే టిడిపికి ఆర్థికంగా అండగా నిలబడిన సానా సతీష్ కు సీటును కేటాయించిన చంద్రబాబు ఎవరు అడగకుండానే, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మంత్రివర్గంలో నాగబాబుకు స్థానం కల్పిస్తానని ఒక ప్రకటన కూడా విడుదల చేయించారు. ఇదంతా పవన్ కళ్యాణ్, నాగబాబును బుజ్జగించి సానా సతీష్ కు ఎంపీ పదవి కట్టబెట్టడానికి అని అప్పట్లో అందరూ భావించారు. నాగబాబు మంత్రి పదవి ఇవ్వాలంటే ముందుగా ఆయన ఎమ్మెల్సీ చేయాలి కదా.. అని ఇప్పటిదాకా మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా నుంచి మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో నాగబాబుకు పోటీగా చంద్రబాబు వర్మను తెరపైకి తెస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని, అది జనసేన కోటా కిందకే వస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. నాగబాబుకి కూడా ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలంటే జనసేనకు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చినట్టు అవుతుందని, ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు జనసేనకే ఇచ్చేస్తే మరి తమ పార్టీ పరిస్థితి ఏమిటి అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అందుకని ఈ దఫా ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబుకు ఇవ్వాలా వర్బకు ఇవ్వాలా అన్నది మీరే నిర్ణయించండి అని బాల్ ను పవన్ కోర్టులోకి చంద్రబాబు నెట్టేసారని వినికిడి.

దీనిపై పిఠాపురం నియోజకవర్గంలోని జనసేన నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నాగబాబు కి పదవి ఇవ్వడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారని, జనసేనను దూరం పెడుతున్నారని అంటున్నారు. టీటీడీ చైర్మన్ ఇవ్వాల్సిన సమయంలో బిఆర్ నాయడును. రాజ్యసభ స్థానానికి ఎంపిక చేసే సమయంలో సానా సతీష్ ను తెరపైకి తెచ్చిన చంద్రబాబు తాజాగా ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేసే సమయంలో వర్మను తెరపైకి తెచ్చి పిఠాపురంలో ఆదిపత్య పోరుకు మరింత ఆజ్యఎం పోస్తున్నారని జనసేన నాయకులు అగ్రహ వ్యక్తం చేస్తున్నారు. వర్మ కు ఎమ్మెల్సీ స్థానం ఇస్తే ప్రోటోకాల్ రీత్యా పవన్ కన్నా వర్మ నెంబర్ వన్ అవుతారు.

ఇప్పటికీ తమ నెత్తి పైకి పెత్తనం చేస్తున్న వర్మను ఎమ్మెల్సీ చేయడం తమకు ఎంత మాత్రం సమ్మతం కాదని అంటున్నారు. పిఠాపురంలో మరో పవర్ సెంటర్ ఏర్పడితే జనసేన భవిష్యత్తుకు ముప్పుగా పరిణమిస్తుందని చెబుతున్నారు. వర్మకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి నాగబాబుని ఎమ్మెల్సీగా చేయాలని వారు సూచిస్తున్నారు. అప్పుడే పిఠాపురంలో తమ పార్టీ మరింత బల పడుతుందని, వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే జనసేన ను బలహీన పరచడానికి వర్మ కుట్రలు చేస్తారని వారు అంటున్నారు.

అసలు చంద్రబాబు నాయుడు కు నాగబాబును మంత్రిని చేయడం మనస్ఫూర్తిగా ఇష్టం లేదని అందుకే ప్రతిసారి ఏదో వంక పెట్టి ఆయనకు పదవిని దూరం చేస్తున్నారని జనసేన నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. నాగబాబును మంత్రిని చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే ఇన్నాళ్లు ఆగడం ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చిన వెంటనే చేసేయొచ్చు కదా. ఆ తర్వాత ఆరు నెలల్లో లోపు ఎమ్మెల్సీ గా చేస్తే సరిపోతుంది కదా అంటున్నారు.

గతంలో నారా లోకేశ్ ను ముందుగా మంత్రిని చేసి ఆ పైనే కదా ఎమ్మెల్సీగా చేసింది అని గుర్తు చేస్తున్నారు కూడా. ఇదంతా చంద్రబాబు పిఠాపురంలో పవన్ కి సెగ పెట్టడానికి ఆధిపత్యం మరింత కొనసాగించడానికి చేస్తున్న రాజకీయ ఎత్తు తప్ప నిజంగా జనసేన నాయకుడు నాగబాబుకు పదవి ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం కాదని ఆ పార్టీ నాయకులు తెగేసి చెబుతున్నారు. పిఠాపురం జనసేన నాయకుల సూచనలను పరిగణలోకి తీసుకొని తన అన్న నాగబాబుకి పవన్ కళ్యాణ్ ఈసారైనా పదవిని సంపాదిస్తారో? లేదో? చూడాలి మరి!

అన్నకోసం సున్నం || Social Activst Krishna Kumari On Pawan Kalyan MLC Post Gives To Nagababu | TR