ఇలా చేస్తున్నావేంటి పవన్… నిన్ను నమ్మినోళ్లు చివరకు వెర్రోళ్ళు అవటం ఖాయం !

Pawan's silence erodes public confidence in him

రాజకీయ నాయకులు ఇచ్చిన మాట మీద నిలబడరన్న సంగతి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎవరు కూడా నిలదీసి ప్రశ్నించే ధైర్యం చేయలేరు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా మంది నాయకుల ఊసరవెల్లి తీరుని యువత ఎండగడుతున్నారు. వీడియో సాక్ష్యాలతో సహా ముందుకు వస్తూ… సార్ మీరు అప్పుడు ఏం చెప్పారు… ఇప్పుడు ఏం చేస్తున్నారు అని రాజ‌కీయ పార్టీల‌పైనా, నేత‌ల‌పైనా విరుచుకుప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Pawan's silence erodes public confidence in him
Pawan’s silence erodes public confidence in him

నాయకులు ఎవ‌రైనా ,పార్టీలు ఏవైనా… సోష‌ల్ మీడియాకు ఒక్క‌టే. అందుకే సోష‌ల్ మీడియా గ‌ళానికి ప‌దును, విలువ పెరుగడంతో నాయ‌కుల‌కు ద‌డ పుడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై సోష‌ల్ మీడియా జ‌నాలు దుమ్మెత్తి పోస్తున్నారు. సార్ మీరు అప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇందుకేనా మేం మీకు ఓట్లేయాలి? అని నిల‌దీస్తున్నారు. క‌ళ్లూముసుకుని నాయ‌కులు ఉన్నా సోష‌ల్ మీడియాలో స్పందిస్తున్న గ‌ళాల‌ను మాత్రం ఎవ‌రూ ఆప‌లేక పోతున్నారు.

ప్ర‌శ్నిస్తాను,అన్యాయంపై పోరాటం చేస్తాను అంటూ… రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌ ఇప్ప‌టి వ‌రకు ఎవ‌రినీ ప్ర‌శ్నించ‌లేక పోయారు. అయితే తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ విష‌యంలో ఏపీకి తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని బీజేపీ నాయ‌కులే గుస‌గుస‌లాడుతున్నారు. ఇలా అయితే ఎలా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి అని సీమ‌కు చెందిన ఓ యువ నాయ‌కుడు గుస‌గుస‌లాడిన ఆడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రి ఇంత‌గా బీజేపీ నేత‌లే దుమ్మెత్తి పోస్తున్న కేంద్ర బ‌డ్జెట్‌పై… ప‌వ‌న్ ఏం చేస్తున్నారు? ప‌్ర‌శ్నిస్తున్నారా?

హోదా మాట ప‌క్క‌న పెడితే క‌నీసం బ‌డ్జెట్లో ఏపీకి నిధులు లేవు. పోల‌వ‌రం ఊసు లేదు రైల్వే జోన్ మాట క‌నిపించ‌లేదు. పోనీ వెనుక‌బ‌డిన సీమ‌కు నిధులు,నీళ్లు కూడా లేవు. ఇక‌, విశాఖ‌లో ప‌రిశ్ర‌మ‌ల ఊసు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు ధారాద‌త్తం చేసే చ‌ర్య‌లు ఊపందుకున్నాయి. ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్‌పై పెదవి కూడా విప్ప‌ని ప‌వ‌న్‌ను ఎలా అర్ధం చేసుకోవాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు సోష‌ల్ మీడియా జ‌నాలు.

నిజ‌మే … క‌దా ! బాధ్య‌త కలిగి విలువలున్న నాయ‌కుడుగా, భ‌విష్య‌త్తు తరాలకు ఆశాకిరణంగా భావిస్తున్న  ప‌వ‌న్ ఇలాంటి తరుణంలో నోరు విప్పి ప్రశ్నించకకపోవటం అనేది అందరిలోనూ రకరకాల ఊహాగానాలకి, అనుమానాలకు తావిస్తుంది. ఇలానే ఉంటే పవన్ రాజకీయ భవిష్యత్ కు రాబోయే 2024 ఎన్నికలలో ప్రజలు మంగళం పాడేస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.