AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కడప పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ తీరును తప్పు పట్టారు. 11 వచ్చిన మాకు అహంకారం తగ్గలేదా మా తోలు తీసి కింద కూర్చో పెడతావా? ఒక్క సీటు వచ్చిన నువ్వు అధికారంలోకి రాలేదా 11 వచ్చిన మేము అధికారంలోకి ఎందుకు రాలేము అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
ఇక వైకాపా నేతల గురించి ఈయన ఇష్టానుసారంగా మాట్లాడటానికి శివప్రసాద్ రెడ్డి వ్యతిరేకించారు.తాము ఉద్యోగులను రాచి రంపాన పెట్టినట్టు మాట్లాడడం తగదన్నారు. క్యాంపు ఆఫీసు పెట్టి కంట్రోల్ చేశారా? అంటూ మండిపడ్డారు. తామేమైనా స్కూల్ పిల్లలమా? అంటూ ప్రశ్నించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మేము కూడా స్వాగతిస్తాం అంతేకానీ మాకు తోలు తీయడానికి మీరు క్యాంప్ ఆఫీస్ పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని తెలిపారు.
మీరు మాతో యుద్ధం చేయాలి అంటే మీకు అధికారం ఉండాలేమో మాకు అవసరం లేదు అంటూ ఈ అన్న తమదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. మీరు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి పై చెప్పు చూపించారో అదే రోజు మా అధినేత మీ నోటికి తాళం వేసి ఉండి ఉంటే ఈరోజు మీరు ఇలా మాట్లాడే వారు కాదు అంటూ రాచమల్లు తెలిపారు. రెడ్లను ప్రత్యేకంగా చూడక మొన్నటి ఎన్నికల్లో వారంతా జగన్‌కు దూరమయ్యారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. మరి పవన్ నిజంగానే కడపలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి రాయలసీమలో కూడా చక్రం తిప్పబోతున్నారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది.