మూడు రాజధానులను వ్యతిరేకించడంతో జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర.. రాయలసీమ జిల్లా వాసులకు విలన్ అయ్యాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ రెండు ప్రాంతాల్లో పవన్ పై టోన్ మారింది. కులానికి అతీతంగా ఇప్పుడు పవన్ ని వ్యతిరేకిస్తుండడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. జనసేన పార్టీని స్థాపించిన అనంతరం రకరకాల సంచలనాలతో అప్పట్లో రీల్ హీరో రియల్ గాను హీరో అయ్యారు అనిపించుకున్నా ఇప్పుడు కేవలం రీల్ కు మాత్రమే హీరో.. రియల్ హీరో కానే కాదంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులకు.. చంద్రబాబు నాయుడు కు మద్దతుగా నిలిచి ఉత్తరాంధ్ర.. సీమ జిల్లాల ప్రజలకు శత్రువు అయ్యాడన్న చర్చ సాగుతోంది. ఇటీవలే బిజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ప్రజల్లో మరింత నెగిటివ్ అయ్యాడు. ఉత్తరాంధ్ర..రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతోన్న ద్రోహి అంటూ ప్రజలతో అక్షింతలు వేయించుకోవడం చర్చకు వచ్చింది.కుంటున్నాడు.
గత వారం రోజులుగా అమరావతి లో తాను కొనుక్కున్న 62 ఎకరాల్ని కాపాడుకునేందుకే పవన్ ఈ పని చేస్తున్నాడని..29 గ్రామాల రైతుల పక్షాన నిలబడి కోట్లాది రూపాయాలు ఆర్జించాలన్న పన్నాంగం పన్నాడని దీంతో ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ గా మారిపోయాడని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాంగ్ మార్చ్ లను నిర్వహించి ప్రజలను ఏమి ఉద్దరించాడు? ఒక్కటైనా ఉపయోగకరమైన పని చేశాడా? అంటూ ప్రజలు సీరియస్ గానే ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో ఓ వర్గానికి కొమ్ము కాస్తూ అర్ధం లేని రాజకీయాలు చేస్తున్నాడని వైకాపా శ్రేణలు తీవ్రంగానే ఆరోపిస్తున్నాయి.
దమ్ముంటే పవన్ ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో గానీ…రాయలసీమ జిల్లాల్లో గానీ లాంగ్ మార్చ్ లు నిర్వహించాలని… అతని బలం ఎంతో నిరూపించుకోవాలని వైజాగ్ యువత సవాల్ విసిరింది. అతను పవర్ స్టార్ కాదు.. ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు నాయుడు భారీ ప్యాకేజ్ తో పాటుగా .. అమరావతిలో ఖరీదైన ల్యాండ్ ఆఫర్ చేయడంతోనే అక్కడి రైతులకు మద్ధతుగా నిలిచాడని మిగతా అన్ని జిల్లాల రైతుల పొట్ట కొడుతున్నాడని వైకాపా నేతలు ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై సామాన్య ప్రజల్లోనూ విస్త్రతంగా చర్చ సాగుతోంది. రియల్ హీరో అనుకుంటే ప్యాకేజీ హీరో అవుతాడా? అంటూ విమర్శలు అంతే ఇదిగా వినిపిస్తున్నాయి.