‘ఆహా’లోనూ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గోలే.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడుసార్లు పెళ్ళి చేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చట్ట బద్ధంగా విడాకులు తీసుకుని, తదుపరి పెళ్ళిళ్ళు చేసుకున్న దరిమిలా, ఇందులో అసలు వివాదానికే ఆస్కారం లేదు. కాకపోతే, నైతికత కోణంలో పవన్ కళ్యాణ్ ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే పెళ్ళిళ్ళ విషయంలో.

ప్రజా జీవితంలో వున్నాక, పెళ్ళిళ్ళపై విమర్శలొస్తాయ్. వాటిని లైట్ తీసుకోవడమే మంచిది. చేతనైతే సమాధానం చెప్పాల్సి వుంటుంది. అంతే తప్ప ఎదురుదాడికి దిగకూడదు. అయితే, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్ల, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికీ.. ఈ అనంత విశ్వానికి వచ్చే సమస్య ఏముంటుంది.? ఏమీ వుండదు.

కానీ, దీన్నొక యూనివర్సల్ ఇష్యూని చేయడం కేవలం రాజకీయం. ఆ రాజకీయ లబ్ది ఎంత.? అన్నది రాజకీయం చేస్తున్నోళ్ళకే తెలియాలి. ‘ఆహా’ వేదికగా పవన్ కళ్యాణ్‌ని అన్‌స్టాపబుల్ క్వశ్చన్స్ వేశాడు బాలయ్య.. అదీ పెళ్ళిళ్ళ గురించి. అది రికార్డెడ్ షో.! పైగా, ప్రీ ప్లాన్డ్ షో. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌కి చెందిన ఓటీటీ వేదిక అది. అక్కడ నిఖార్సయిన ప్రశ్నలు, అంతకన్నా నిఖార్సయిన సమాధానాలు వుంటాయనుకోవడం పొరపాటు.

అసలు ఈ పెళ్ళి గోల అంటేనే అర్థం పర్థం లేని వ్యవహారం. దీనిపై మళ్ళీ ట్రోలింగ్ ఓ వైపు.. ఇంకో వైపు సమర్థనలు.