పవన్ సినిమాకి బాలయ్య సినిమా టైటిల్ వద్దంట!

ఓ వైపు అభిమానులకు తనసినిమాల ద్వారా కావాల్సినంత వినోదాన్ని అందించే పనిలో ఉంటూనే.. మరోవైపు తీరిక దొరికినప్పుడల్లా ప్రజా సమస్యలపై పోరాడుతూ బిజీగా ఉంటున్నారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల ప్రచార రథం వారాహిపై రోడ్‌ షో ని ఎవరూ ఊహించని విధంగా తాత్కాలికంగా నిలిపేసిన పవన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేసేశారు.

ఈ క్రమంలో… ప్రస్తుతం “వినోధయ సీతమ్” రీమేక్‌, “హరిహరవీరమల్లు”, సుజిత్‌ దర్శకత్వంలో “ఓజీ”, హరీష్‌ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌” సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే! వీటిలో అన్నిటికంటే ముందుగా రావాల్సిన చిత్రం క్రిష్‌ దర్శకత్వంలో చేస్తున్న “హరిహరవీరమల్లు” కాగా… కొన్ని పొలిటికల్ కమిట్‌ మెంట్స్ కారణంగా అనుకున్న సమయానికి రాలేకపోయింది.

ఇలాంటి పరిస్థితి మరేసినిమాకీ రాకూడదని, తద్వారా నిర్మాతకి ఇబ్బంది కలగకూడదని ఫిక్సయిన పవన్… ప్రస్తుతం తను కమిట్‌ అయిన సినిమాలన్నింటికి న్యాయం చేసేలా పక్కాగా సమ్మర్ ప్లాన్ చేసుకున్నాడట. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి… ఈ ఏడాదిలోనే కమిట్ అయిన అన్ని సినిమాలూ పూర్తి చేయాలనుకుంటున్నారట. అనంతరం ఈ ఏడాది చివర్లో రాజకీయాలవైపు దృష్టి సారించాలని ఫిక్సయినట్లు తెలుస్తుంది!

అయితే ఈ సందర్భంగా పవన్ సినిమా టైటిల్ కి సంబందించి ఒక ఆసక్తికరమైన చర్చ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తుంది. అదే… సముద్రఖని దర్శకత్వంలో సాయిధరం తేజ్‌ తో పవన్‌ కల్యాణ్‌ కలిసి నటిస్తున్న చిత్రానికి సంబందించిన టైటిల్! అవును.. ఆ సినిమాకు “దేవుడు” అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారంట మేకర్స్! ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ సినిమా విడుదల ఉండొచ్చు కాబట్టి… ఈ టైటిల్ ఎఫెక్టివ్ గా ఉంటుందని.. ఫ్యాన్స్ కూడా పవన్ ని డమ్మీ గాడ్ గా భావిస్తారు కాబట్టి.. టైటిల్ అతిగా ఏమీ ఉండదని అంటున్నారంట!

అయితే… అయితే మరికొందరు మాత్రం “దేవుడు” టైటిల్ వద్దని… “దేవుడు” బదులు “దేవర” అనే టైటిల్ పెడితే బాగుంటుంది కదా అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే బండ్ల గణేష్ “దేవర” అనే టైటిల్ ను పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫిక్స్ చేసి, రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. అయితే… పవన్ కళ్యాణ్ స్వయంగా అడిగితే బండ్ల గణేష్ ఆ టైటిల్ని ఈ సినిమా కోసం ఇస్తాడనండలో సందేహం లేదు. కాబట్టి.. టైటిల్ విషయంలో మరోసారి ఆలోచించాలని అభ్యర్థిస్తున్నారంట పవన్ ఫ్యాన్స్!

కాగా… 1997లో బాలకృష్ణ – రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఇదే “దేవుడు” టైటిల్ తో ఒక సినిమా వచ్చిన సంగతి
తెలిసిందే!