వైరల్ : మహేష్ బాబుకి పవన్ బర్త్ డే విషెష్..పోస్ట్ ఓ రేంజ్ లో ట్రెండ్.!

తెలుగు సినిమా దగ్గర చాలా మంది హీరోలు ఉండొచ్చు కానీ ఓ ఇద్దరు స్టార్స్ ని మ్యాచ్ చెయ్యడం మాత్రం వారిద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం అని చెప్పాలి. ఆ ఇద్దరు హీరోలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు అని చెప్పాలి.

ఈ ఇద్దరు కూడా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నవారిని తెలిసిందే. మరి ఈ ఇద్దరు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆ రేంజ్ లోనే గొడవ పడతారు. ఇక అలాగే ఈ ఇద్దరు స్టార్ట్ పై కూడా ఓ మల్టీ స్టారర్ వస్తే చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

మరి ఈ ఇద్దరు కూడా ఎప్పుడో అర్జున్ సినిమా సమయంలో ఓ స్టేజి మీదకి వచ్చారు. తర్వాత పవన్ కోసం మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా పవన్ కం బ్యాక్ వకీల్ సాబ్ పై మహేష్ బాబు తన స్పందన ఇచ్చాడు.

మరి ఫైనల్ గా ఈరోజు మహేష్ బర్త్ డే కావడంతో మహేష్ కోసం పవన్ ఒకడుగు ముందుకేసి తన బెస్ట్ విషెష్ బర్త్ డే సందర్భంగా తెలియజేసారు. “ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టి సేవా కార్యక్రమాలు…

హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. ‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను.

పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిదాం. ‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది.

కథానాయకుడిగా తనదైన పంధాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.” అని పవన్ తెలిపాడు. దీనితో ఇరు హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరికొందరు ఇది కూడా పవన్ తన పొలిటికల్ హ్యాండిల్ నుంచే పెట్టాలా నార్మల్ గా పెట్టొచ్చు కదా అని అంటున్నారు. మొత్తానికి అయితే ఈ పోస్ట్ పెద్ద ఎత్తున రెస్పాన్స్ తో వైరల్ గా మారింది.