చంద్రబాబునాయుడుపై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్స్, వీడియోలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిత్లీ తుఫాను బారిన పడిన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తూ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు. సహాయక చర్యలు చేయడంలో టిడిపి ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పర్యటించిన పలు ప్రాంతాల్లోని సమస్యలను ట్విట్టర్ లో పోస్టులు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబుని దుయ్యబడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన ట్విట్టర్ లో పెట్టిన పోస్టు వివరాలు కింద ఉన్నాయి చదవండి.

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను శ్రీకాకుళంలో ఉన్నానని కనిపించట్లేదో, గుర్తించుకోవాలని అనుకోవట్లేదో తెలియట్లేదు కానీ, నేను పలాస నియోజకవర్గంలోని నువ్వులపాలెంలో కటిక చీకట్లో దసరా పండగని శ్రీకాకుళం తుఫాను బాధితులతో జరుపుకుని వస్తున్నాను”. పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో వీడియో పెట్టి ఈవిధంగా రాసుకొచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మభూమి కమిటీల గురించి సగటు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే -‘నేను ఈరోజు పలాస నియోజకవర్గంలోని (అల్లుడు టాక్స్ నియోజకవర్గం- నా మాట కాదు -ప్రజల మాట) నువ్వులపాలెంలో తీసిని వీడియో ఒకసారి చూడండి అంటూ వీడియో పోస్ట్ చేసారు పవన్.